Begin typing your search above and press return to search.

ఇన్నేసి క్యారెక్టర్లు ఏందయ్యా సామీ

By:  Tupaki Desk   |   11 Jan 2016 1:30 PM GMT
ఇన్నేసి క్యారెక్టర్లు ఏందయ్యా సామీ
X
పొల్యుషన్‌ గిరిగా సప్తగిరి.. వీరభద్రమ్మాగా ఊర్వశి.. బిల్‌ గేట్స్‌ గా బ్రహ్మాజీ.. భీబత్సనటరాజ్‌ గా షకలక శంకర్‌.. ధనరాజ్‌ గా ఇనుము.. మావయ్యా శ్రీనుగా ప్రభాస్‌ శ్రీను.. ఇనుముగా ధనరాజ్‌.. బినామీ బ్రిటీష్‌ గా సుప్రీత్‌.. ఇక ఎక్సప్రెస్‌ రాజాగా శర్వానంద్‌.. అమూల్యగా సురభీ.. వామ్మో వామ్మో.. ఇన్ని క్యారెక్టర్లా అసలు? ఇంతకీ ఈ సినిమాలో ఏముందండీ బాబూ?

'వాంటేజ్‌ పాయింట్‌' అనే ఓ సినిమాను చూసి ఇప్పటికే చాలామంది దర్శకులు కాపీ కొట్టారు. ఒకసారి చెప్పిన కథనే మళ్లీ మళ్ళీ వేరే వేరే యాంగిల్స్‌ నుండి చెప్పడం ఈ సినిమా ప్రత్యేకత. ఇప్పుడిక ఎక్స్‌ ప్రెస్‌ రాజా కూడా ఇదే ఫార్మాట్‌ లో ఉండబోతోందని అర్దమవుతోంది. స్వయంగా మేర్లపాక గాంధి ఈ విషయాన్ని చెప్పేశాడు. ప్రతీ ఐదు నిమిషాలకూ కొత్త పాయింట్‌ ఏదో చెబుతాడట. బాగానే ఉంది కాని.. ఆ స్ర్కీన్‌ ప్లే లో మరీ ఇన్ని క్యారెక్టర్లంటే గుర్తుపెట్టుకోవడానికి ఆడియన్స్‌ కు మైండ్‌ బ్లాంక్‌ అయిపోతుందేమో బాబాయ్?

ఇకపోతే ఈ సినిమా హిట్టవ్వడం శర్వానంద్‌ కు చాలా ముఖ్యం. రన్‌ రాజా రన్‌ తో హిట్టొచ్చింది.. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజుతో పేరొచ్చింది. ఇప్పుడు ఎక్స్‌ ప్రెస్‌ రాజా హిట్టయితేనే ఈ సక్సెస్‌ అంతా కలసి సూపర్‌ స్టార్ డమ్‌ గా మారేది.