Begin typing your search above and press return to search.

విజయ్ సినిమాకు విశాల్ మోక్షం కల్పిస్తాడా?

By:  Tupaki Desk   |   11 Oct 2017 7:58 AM GMT
విజయ్ సినిమాకు విశాల్ మోక్షం కల్పిస్తాడా?
X
సౌత్ ఇండియాలో ఈ ఏడాది రాబోయే చివరి భారీ సినిమా ‘మెర్శల్’. విజయ్ కథానాయకుడిగా విజయేంద్ర ప్రసాద్ కథతో అట్లీ రూపొందించిన ఈ చిత్రంపై అంచనాలు మామూలుగా లేవు. ఐతే ఈ మధ్యే ఈ చిత్రం టైటిల్ వివాదంలో చిక్కుకుంది. దాన్నుంచి కొన్ని రోజుల కిందటే బయటపడి ఊపిరి పీల్చుకుంది. ఇక ఉత్సాహంగా విడుదలకు సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ పెద్ద బాంబు పేల్చాడు. జీఎస్టీకి అదనంగా తమ రాష్ట్ర ప్రభుత్వం విధిస్తన్న స్థానిక పన్ను (10 శాతం) రద్దు చేయకపోతే సినిమాలు విడుదల కానివ్వబోమంటూ తేల్చేశాడు. గత వారాంతంలో ఏ సినిమానూ విడుదల కానివ్వలేదు విశాల్. ఈ వీకెండ్లోనూ అలాగే చేస్తున్నాడు. కొత్త సినిమాల విడుదల లేదని తేల్చేశాడు.

ప్రభుత్వం ఈ పన్నును రద్దు చేసే వరకు కొత్త సినిమాలు విడుదల కావని విశాల్ స్పష్టం చేశాడు. ఐతే ‘మెర్శల్’ విడుదలకు ఇంకో వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఆలోపు సమస్య పరిష్కారమవుతుందో లేదో అని గుబులు పట్టుకుంది ‘మెర్శల్’ టీంకు. దీపావళి పోతే మళ్లీ అలాంటి సీజన్ దొరకదు. అడ్వాంటేజీ పోతుంది. సంక్రాంతి వరకు ఎదురు చూసే పరిస్థితి లేదు. అలాగని విశాల్ ను ప్రశ్నించే పరిస్థితి లేదు. అతను ఒక కాజ్ కోసం ఈ షరతు పెట్టాడు. దీంతో ‘మెర్శల్’ టీం పరిస్థితి అయోమయంగా ఉంది. త్వరగా సమస్య పరిష్కారమై సినిమా అనుకున్నట్లుగా దీపావళికే విడుదల కావాలని విజయ్ ఫ్యాన్స్ కూడా ప్రార్థిస్తున్నారు.