Begin typing your search above and press return to search.
దీపావళి ధమాకా సినిమాకు లైన్ క్లియర్
By: Tupaki Desk | 7 Oct 2017 10:01 AM GMT‘బాహుబలి’ వచ్చెళ్లిపోయింది. ‘వివేగం’ సందడి ముగిసింది. ‘స్పైడర్’ ముచ్చట్లు కూడా అయిపోయాయి. సౌత్ ఇండియాలో ఇప్పుడందరి కళ్లూ విజయ్ సినిమా ‘మెర్శల్’ మీదే ఉన్నాయి. ఈ ఏడాది సౌత్ నుంచి రాబోయే చివరి భారీ సినిమా అంటే ఇదే. ఈ సినిమా రిలీజైనపుడు దక్షిణాదిన మొత్తం సందడి భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆసక్తికరమైన టీజర్ తో ‘మెర్శల్’ అంచనాలు పెంచింది.
ఐతే టీజర్ రిలీజయ్యాక ప్రమోషన్ జోరు మరింత పెంచుదామని చిత్ర బృందం అనుకుటున్న సమయంలో ఈ చిత్రానికి మద్రాస్ హైకోర్టు బ్రేక్ వేసింది. ‘నాన్ మెర్శల్ అయిటేన్’ అనే పేరుతో ఇప్పటికే ఓ సినిమా తీసేందుకు టైటిల్ రిజిస్టర్ చేసిన ఓ నిర్మాత.. తన టైటిల్ ను కాపీ కొట్టారంటూ కేసు వేయడంతో హైకోర్టు సీరియస్ అయింది. ఈ కేసు తేలేదాకా ‘మెర్శల్’ అనే పేరుతో ప్రమోషన్లలో ఉపయోగించకూడదని ఆదేశాలిచ్చింది. దీంతో చిత్ర బృందంలో.. విజయ్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సూపర్ పాపులరైన టైటిల్ ను వదులుకోవాల్సి వస్తుందేమో అన్న కంగారు కూడా పుట్టింది.
ఈ వివాదం వల్ల సినిమా విడుదల కూడా ఆలస్యమవుతుందేమో అన్న భయం కూడా నెలకొంది. ఐతే ఇప్పుడు అన్ని సందేహాలకూ తెరపడింది. మద్రాస్ హైకోర్టు ఈ కేసును కొట్టేసింది. ‘మెర్శల్’ టైటిల్ వాడుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీంతో ‘మెర్శల్’ టీం ఊపిరి పీల్చుకుంది. దీంతో చిత్ర బృందం ఉత్సాహంగా ప్రమోషన్లను పున:ప్రారంభించబోతోంది. దీపావళి కానుకగా ఈ నెల 19న ‘మెర్శల్’ ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ చిత్రాన్ని ‘అదిరింది’ పేరుతో శరత్ మరార్ తెలుగులో అందిస్తున్నాడు.