Begin typing your search above and press return to search.
'ప్లాస్మా - ఆక్సిజన్ సిలిండర్స్ - మెడిసిన్స్ అవసరముంటే నాకు మెసేజ్ చేయండి'
By: Tupaki Desk | 11 May 2021 1:30 PM GMTకరోనా సెకండ్ వేవ్ యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్ నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకునే లోపే మహమ్మారి వైరస్ తన రూపం మార్చుకుని విజృంభిస్తోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరగడమే కాకుండా.. అధిక సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. కళ్లముందే అయినవారిని కోల్పోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కుటుంబ సభ్యులు ఉండి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. హాస్పిటల్ లో బెడ్స్ దొరక్క పోవడం.. ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కరోనా దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీ లేవంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలతో పాటుగా పలువురు ప్రముఖులు వారికి తోచిన విధంగా సహాయం చేయడానికి ముందుకొస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులు ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ తగిన సహాయం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్ గురించి.. హాస్పిటల్స్ లో బెడ్స్ గురించి సమాచారం అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి దర్శకురాలు రేణు దేశాయ్ కూడా తన వంతు బాధ్యత నిర్వర్తించడానికి సంకల్పించారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడిన రేణు దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకునే వాళ్ళు కూడా గత పదిహేను రోజులుగా కోవిడ్ సమాచారాన్ని చేరవేస్తూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని కొనియాడారు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనవంతు సహాయం చేస్తానని.. మెసేజ్ ఇన్ బాక్స్ ఇప్పటి నుంచి ఓపెన్ లో పెడతానని.. హెల్ప్ కావాల్సిన వారు మెసేజ్ చేయాలని.. వారికి సహాయం చేయడానికి తనవంతు కృషి చేస్తానని రేణు దేశాయ్ పేర్కొన్నారు.
ప్లాస్మా లేదా ఆక్సిజన్ సిలిండర్లు లేదా హాస్పిటల్స్ లో బెడ్స్ - మెడిసిన్స్ వంటివి అవసరం ఉంటే దయచేసి తనకు మెసేజ్ చేయాలని.. తాను వీలైనంత వరకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తానని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. దయచేసి స్పార్మ్ మెసేజెస్, నార్మల్ మెసేజులు పంపొద్దని.. నిజంగా అవసరం ఉన్నవారే మెసేజ్ ద్వారా కాంటాక్ట్ అవ్వాలని కోరారు. కానీ గతంలో జరిగిన కొన్ని బ్యాడ్ ఎక్సపీరియన్స్ లు దృష్టిలో పెట్టుకుని ఫైనాన్షియల్ హెల్ప్ మాత్రం చేయలేనని రేణు ఈ సందర్భంగా తెలిపింది. అయితే ఓ నెటిజన్ దిల్ సుఖ్ నగర్ లోని ఓ కాలనీలో కరోనా ఎక్కువగా ఉందని, ఏమైనా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయగలరా అని ప్రశ్నించగా.. పూర్తి వివరాలు తెలియజేయాలని రేణుదేశాయ్ సమాధానం ఇచ్చింది.