Begin typing your search above and press return to search.

మీటర్ టీజర్ టాక్: నన్ను గెలకొద్దు.. అడ్డు రావొద్దు అంటున్న కిరణ్ అబ్బవరం

By:  Tupaki Desk   |   7 March 2023 4:07 PM GMT
మీటర్ టీజర్ టాక్: నన్ను గెలకొద్దు.. అడ్డు రావొద్దు అంటున్న కిరణ్ అబ్బవరం
X
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం... ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకునే పనిలో ఉన్నాడు. ఇటీవలే కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఈ సినిమా ఫిబ్రవరి 18న ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. కొత్త కథతో వచ్చిన కిరణ్ అబ్బవరం సినిమా ఇప్పటికీ బీ, సీ సెంటర్స్‌లో కూడా బానే ఆడుతోంది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇక వరుస సినిమాలను చేస్తున్న ఆయన ఏప్రిల్ నెలలో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. అవును నిజమే కిరణ్ అబ్బవరం 'మీటర్' సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. రమేష్ కాడురి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'మీటర్' సినిమాలో కిరణ్ అబ్బవరం పోలీస్ అధికారిగా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది.

ఇక ఈ మూవీలో కిరణ్ అబ్బవరం ఎస్సై పాత్రలో నటిస్తున్నట్లుగా టీజర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇక ఎస్సైకి అసిస్టెంట్‌గా సప్తగిరి కనిపిస్తున్నాడు. ఎస్సైగా ఉంటూనే రౌడీల మక్కిల్ ఇరగదీస్తున్న క్యారెక్టర్‌లో కిరణ్ అబ్బవరం కనిపిస్తున్నాడు. ఇక ఆయన దగ్గర పనిచేసే మరో పోలీసు అధికారిగా పోసాని కృష్ణ మురళి కనిపిస్తున్నాడు.

ఈ సీన్ అంతా కూడా టెంపర్ సన్నివేశాలను గుర్తు చేస్తోంది. ఉన్న జాబ్ తీసిపారదొబ్బండి సార్ అంటూ పోసాని కృష్ణ మురళిని కిరణ్ అబ్బవరం కోరుతున్న క్రమంలో... ఇదేంటి అల్లుడు ఇంత ట్రస్ట్ ఇచ్చావ్ అంటూ పీఏగా పనిచేస్తున్న సప్తగిరి ప్రశ్నించడం ఆసక్తికరంగా మారింది. అపరిచితుడికి అమ్మ మొగుడిలా తయారయ్యావేంటి అల్లుడు అని సప్తగిరి ప్రశ్నిస్తూ ఉండగా హీరోకి ఉన్న లవ్ యాంగిల్ కూడా చూపించారు.

నీకు సెన్స్ లేదా అని హీరోయిన్ క్యారెక్టర్ పోషిస్తున్న అతుల్య రవి ప్రశ్నిస్తే ఇలాంటి ఫిగర్ ని చూసిన తర్వాత కూడా సెన్స్, కామన్ సెన్స్ పనిచేస్తాయా అంటూ కిరణ్ అబ్బవరం ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. మా మీటర్లో నేను వెళ్తా నన్ను గెలకొద్దు... నాకు అడ్డు రావద్దు అంటూ ఆయన చెబుతున్న డైలాగులు, డాన్సులు సినిమా మీద ఆసక్తిని పెంచేస్తున్నాయి.

టాలీవుడ్‌ బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన మైత్రీ మూవీ మేకర్స్‌సమర్పణలో, పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రమేష్‌ కాదూరి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఏప్రిల్ 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.