Begin typing your search above and press return to search.
#మీటూ : సహకరిస్తే సూపర్ స్టార్ అవుతావన్నాడు
By: Tupaki Desk | 15 Oct 2018 6:29 AM GMTబాలీవుడ్ ను మీటూ ఉద్యమం కుదిపేస్తోంది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న వారు ఇప్పుడు నోరు తెరుస్తున్నారు. పదుల సంఖ్యలో సినీ ప్రముఖులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ పై లైంగిక ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో సంచలనంగా మారిన మీటూ ఉద్యమంలో భాగంగా ఒక మహిళ టీ సిరీస్ అధినేత, ప్రముఖ ఫిల్మ్ మేకర్ భూషన్ కుమార్ పై సంచలన ఆరోపణలు చేసింది. మూడేళ్ల క్రితం తనపై భూషన్ కుమార్ చేసిన లైంగిక వేదింపులను ఆమె ఇప్పుడు మీడియా ముందుకు తీసుకు వచ్చింది.
టీ సిరీస్ నిర్మాణంలో మూడేళ్ల క్రితం తనకు మూడు సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ఆ మూడు సినిమాలు చేయాంటే తనతో ఒక్క రాత్రి గడపాలని భూషన్ కుమార్ డిమాండ్ చేశారని, తనతో ఒక్కరాత్రి గడిపితే నిన్ను సూపర్ స్టార్ ను చేస్తానంటూ హామీ ఇచ్చాడని ఆమె పేర్కొంది. భూషన్ కుమార్ ను మొదటి సారి ఆయన ఆఫీస్ లో కలిశాను, ఆ తర్వాత రోజు సినిమా ఒప్పందం కోసం సంతకాలు తీసుకోవాలి, తన బంగ్లాకు రావాల్సిందిగా కాల్ వచ్చింది.
నేను చెప్పినట్లుగా విని, నాతో సంబంధం కంటిన్యూ చేసేందుకు ఒప్పుకుంటే సూపర్ స్టార్ చేసే బాధ్యత నాదని, నీకు మంచి భవిష్యత్తు ఉందని నమ్మబలికాడు. అయితే నేను మాత్రం ఆ ప్రతిపాధనను తిరష్కరించాను. సినిమా ఆఫర్ల కోసం ఒకరితో గడపాల్సి వస్తే నాకు ఆ సినిమా ఛాన్స్ అవసరం లేదని సమాధానం చెప్పానంటూ ఆమె పేర్కొంది. అప్పట్లో ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపిస్తా అంటూ బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది. భూషన్ కుమార్ తో గడిపేందుకు నిరాకరించిన కారణంగా నాకు వచ్చిన మూడు సినిమా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.