Begin typing your search above and press return to search.
#మీటూ: అమైరాను హీరో అలా వేధించాడట
By: Tupaki Desk | 11 Oct 2018 11:38 AM GMTబాలీవుడ్ లేదు.. టాలీవుడ్ లేదు ఇప్పుడు అన్ని చోట్ల #మీటూ హంగామానే. గతంలో కూడా #మీటూ కాంపెయిన్ లో భాగంగా కొంతమంది తమకు జరిగిన సంఘటనలు బయటకు చెప్పుకున్నారు గానీ తాజాగా పరిస్థితి మరింతగా వేడెక్కింది. ఎప్పుడైతే తనుశ్రీ దత్తా నానా పటేకర్ పై ఆరోపణలు చేసిందో అప్పటి నుండి ఎంతోమంది సెలెబ్రిటీలు తమకు ఎదురైన వేధింపుల గురించి బయట పెడుతూ సంచలనాలకు కేంద్ర బిందువు అవుతున్నారు.
తాజాగా #మీటూ లో భాగంగా మరో హీరోయిన్ అమైరా దస్తూర్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తనకింతవరకూ క్యాస్టింగ్ కౌచ్ ఎదురుకాలేదని.. కాకపొతే సౌత్ లోనూ బాలీవుడ్ లోనూ వేధింపులకు గురయిందని తెలిపింది. ఒక పాట చిత్రీకరణ సమయంలో హీరో తనను గట్టిగా హత్తుకుని నలిపాడట.. పైగా తన చెవిలో "నువ్వు ఈ సినిమాలో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నాడట. వెంటనే ఆ హీరో ను పక్కను నెట్టేసిందట. అప్పటి నుండి ఆ హీరోతో మాట్లాడేందుకు ఇష్టపడలేదట. ఇక అప్పటినుండి అమైరా ను మరింతగా టార్చర్ చేయడం మొదలు పెట్టాడట. షూటింగ్ లొకేషన్ కు పొద్దునే పిలిపించేవాడట. 12 - 13 గంటలు వెయిట్ చేయించిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ను కారవాన్ దగ్గరకు పంపి.. ఈ రోజు తనకు షూటింగ్ లేదని చెప్పించేవాడట. అసలు ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నందుకు ఆమె రుణపడి ఉండాలన్నట్టు మాట్లాడేవాడట. అంతే కాదు హీరోను కేర్ చేయలేదు అన్నట్టుగా నిర్మాతకు చెప్పి అమైరా చేత సారీ చెప్పించుకున్నాడట.
ఇక ఆ సినిమా డైరెక్టర్ మాత్రం హీరో విషయం పట్టించుకోవద్దని చెప్పాడట. అమైరా తనకు ఎదుర్కొన్న వేధింపులు బయటపెట్టినా ఆ హీరో పేరు మాత్రం బయటపెట్టకపోవడం విశేషం. సమయం వచ్చినప్పుడు.. తనకు నమ్మకం కుదిరనప్పుడు మిగతా వివరాలు బయటపెడతానని తెలిపింది. అంతా ఒకే గానీ.. హీరో పాత్ర పోషిస్తూ విలన్ పనులు చేసిన ఘనుడెవరా అని సోషల్ మీడియాలో ఫుల్లుగా చర్చలు జరుగుతున్నాయి.