Begin typing your search above and press return to search.
'హౌస్ ఫుల్ 4' ను వదలని మీటూ..!
By: Tupaki Desk | 26 Oct 2018 12:04 PM GMTబాలీవుడ్ లో మీటూ ఉద్యమం తారా స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో ఎంతో మంది స్టార్స్ తలరాతలు మారిపోతున్నాయి. ఎన్నో సినిమాల టెక్నీషియన్స్ మారుతున్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సీక్వెల్ అయిన ‘హౌస్ ఫుల్ 4’ దర్శకుడు సాజిత్ ఖాన్ బాధ్యతల నుండి తొలగించబడిన విషయం తెల్సిందే. హౌస్ ఫుల్ 4 చిత్రంలో కీలక పాత్రకు ఎంపిక అయిన నానా పటేకర్ ను కూడా ఇప్పటికే తొలగించి ఆయన స్థానంలో రానాను తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మీటూ ఉద్యమం వల్ల ఇతర సినిమాల కంటే ఎక్కువగా హౌస్ ఫుల్ 4 చిత్రం ప్రభావితం అవుతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.
మీటూ విమర్శల నేపథ్యంలో అనేక మార్పులు - చేర్పులు చేసుకుంటూ ‘హౌస్ ఫుల్ 4’ చిత్రం షూటింగ్ జరుపుతున్నారు. ఇలాంటి సమయంలోనే చిత్ర సెట్స్ లో ఒక జూనియర్ ఆర్టిస్టుపై లైంగిక వేదింపులకు పాల్పడటం ప్రస్తుతం బాలీవుడ్ లో చర్చనీయాంశం అవుతుంది. నిన్న రాత్రి హౌస్ ఫుల్ 4 చిత్రీకరణ జరుపుతున్న సెట్ లో బాధితురాలు ఉండగా పవన్ శెట్టి - సాగర్ అనే ఇద్దరు మరో ఇద్దరితో కలిసి వచ్చి జూనియర్ ఆర్టిస్టును లైంగికంగా వేదించారట. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా దురుసుగా ప్రవర్తించి వారి ప్రైవేట్ పార్ట్‌లను టచ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారట.
ఆ సమయంలో సెట్స్ లో అక్షయ్ కుమార్ - రితేష్ ఇంకా ఇతర ముఖ్య చిత్ర యూనిట్ సభ్యులు లేని కారణంగా తాను పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని బాధితురాలు మీడియా ముందుకు వచ్చి పేర్కొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మీటూ వల్ల హౌస్ ఫుల్ 4 చిత్రంపై నీలి నీడలు కమ్ముకున్న నేపథ్యంలో ఈ సంఘటన మరోసారి చిత్రంకు పెద్ద భారంగా మారింది. ఈ సంఘటనపై అధికారికంగా హౌస్ ఫుల్ 4 చిత్ర యూనిట్ సభ్యులు స్పందించాల్సి ఉంది.