Begin typing your search above and press return to search.
ఆమెను ఆ దర్శకుడు కారులో వేధించాడట!
By: Tupaki Desk | 17 Oct 2018 7:51 AM GMTఅంతకంతకూ మీటూ హీటెక్కుతోంది. రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఇన్నాళ్లు గుండెల్లో దాచుకున్న లావాను బద్ధలు కొడుతూ మహిళలు తమకు జరిగిన అన్యాయాల్ని.. వేధింపుల్ని ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందుతూ.. తమపై జరిగిన లైంగిక వేధింపులను వెల్లడిస్తున్నారు.
ప్రముఖ సినీ గేయ రచయిత.. తమిళ చిత్రపరిశ్రమలో మంచి పేరున్న వైరముత్తు పై గాయని చిన్మయి చేసిన ఆరోపణలు సంచలనంగా మారటమే కాదు.. పెద్ద అలజడినే సృష్టించాయి. ఇది ఒక కొలిక్కి రాకముందే.. తాజాగా తమిళ మహిళా దర్శకురాలు లీనా మణిమేఖలై సంచలన ఆరోపణలు చేశారు.
విరుంబుగిరేన్.. తిరుట్టపయలే లాంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శశిగణేశన్ తనను కారులో లైంగిక వేధింపులకు గురి చేశారని ఆమె వెల్లడించారు. 2005 లో తాను కవియిత్రి.. వ్యాఖ్యాతగా ఉన్నప్పుడు ఒక రోజు శశిగణేశణ్ ను తాను ఒక స్టూడియోలో ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. ఇంటికి ఆటోలో వెళుతుంటే.. తాను లిఫ్ట్ ఇస్తానని చెప్పి కారులో ఎక్కించుకున్నారన్నారు. అనంతరం అతగాడు తన పై వేధింపుల పర్వాన్ని మొదలెట్టాడన్నారు. చివరకు తన బ్యాగ్‌లో ఉన్న కత్తిని తీసుకొని బెదిరించి తన ఇంటి వైపు వెళ్లాలని చెప్పానని.. దాంతో బెదిరిపోయి తనను ఇంటి దగ్గర దించి వెళ్లాడన్నారు.
ఈ విషయాన్ని లీనా బయటపెట్టినంతనే దర్శకుడు శశిగణేశణ్ స్పందించారు. మీటూను అడ్డు పెట్టుకొని లీనా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని.. తాను గేయ రచయితగా పైకి రాలేకపోయానని.. తనను అసిస్టెంట్ డైరెక్టుగా చేర్చుకోవాలంటూ తనను వేధింపులకు గురి చేసినట్లుగా రివర్స్ ఆరోపణలు చేశారు. దీంతో.. వీరిద్దరి మధ్య ఆరోపణల పర్వం సాగుతోంది. ఈ వ్యవహారం తమిళ సినిమా రంగంలో హాట్ టాపిక్ గా మారింది.