Begin typing your search above and press return to search.
ఆ డైరెక్టర్ తో మిల్కీ వాట్టూడూ?
By: Tupaki Desk | 26 March 2019 6:15 AM GMT2018-19 సీజన్ లో మీటూ ప్రకంపనాల గురించి తెలిసిందే. మీటూ ఉద్యమంపై నిరంతరం ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ఉద్యమంలో హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఎందరో వేధింపుల రాక్షసుల గుట్టు బయటపెట్టారు. అయితే ఉద్యమం సరైన దారిలోనే ఉందా? అంటూ సెలబ్రిటీల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఘటన జరిగిన పదేళ్లకు కానీ బయటపడని ఎందరో కథానాయికలు ఇందులో ఉన్నారు. తొలుత దర్శకనిర్మాతలకు కమిట్ మెంట్లు ఇచ్చిన వాళ్లు ఇంతకాలం తర్వాత ప్రచారార్భాటం కోసం మీటూ ఉద్యమాన్ని వాడుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. సీనియర్ నటుడు అర్జున్ షార్జా విషయంలోనూ ఈ తరహా ప్రచారం సాగడంపై పలువురు కథానాయికలే ఖండించే ప్రయత్నం చేశారు.
మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రముఖులకు పలువురు కథానాయికల నుంచి మద్ధతు లభించడంతో ఈ ఉద్యమం విషయంలో ఏం జరుగుతోందో అందరిలోనూ కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ విషయంలో ఆయనతో పని చేసిన పలువురు కథానాయికలు లైంగిక వేధింపులపై ఆరోపిస్తే.. మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా మాత్రం అతడిని వెనకేసుకు రావడం ప్రముఖంగా చర్చకు వచ్చింది.
సాజిద్ ఖాన్ తన విషయంలో ఎలాంటి తప్పు చేయలేదని, అసభ్యంగా ఏనాడూ ప్రవర్తించలేదని ఇదివరకూ పలుమార్లు మిల్కీ బ్యూటీ మీడియా ముఖంగా ఖరాకండిగా చెప్పింది. మరోసారి ప్రఖ్యాత బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన తమన్నా .. ఈసారి కూడా అతడు అలాంటివాడు కాదు! అని చెప్పడం సంచలనమైంది. మీటూ ఉద్యమాన్ని పీఆర్ ఉద్యమంలా మార్చారు! అన్న కోణంలోనూ తమన్నా సీరియస్ గానే వ్యాఖ్యానించింది. తమన్నా మాట్లాడుతూ- 'మీటూ ఉద్యమంలో ఎందరిపైనో ఆరోపణలు వచ్చాయి. మీటూ అనేది మగువలు తమకు ఎదురైన సంఘటనల్ని, అనుభవాల్ని బయటి ప్రపంచానికి తెలియజేసే ఉద్యమం. తమ జీవితాల్లో ఎదురైన ఘటనల్ని, నిజాల్ని బయట పెట్టేందుకు చాలా ధైర్యం కావాలి. కానీ కొందరిని చూసినప్పుడు మీటూ ఉద్యమం దాని అర్థాన్ని కోల్పోయిందని అనిపించింది. అదంతా పీఆర్ ప్లాయ్! ' అంటూ చెప్పుకొచ్చింది. మీటూ అనేది కాస్త సీరియస్ గా సాగాల్సిన వ్యవహారం. కానీ హాస్యాస్పదం అయిపోయిందని తమన్నా వ్యాఖ్యానించారు. సాజిద్ ఖాన్ దర్శకత్వంలో హిమ్మత్ వాలా, హమ్ షకల్స్ చిత్రాల్లో తమన్నా నటించారు. అయితే వేధింపుల వ్యవహారంలో పదే పదే సాజిద్ ఖాన్ ని వెనకేసుకొస్తున్న తమన్నా అతడికి క్లీన్ చిట్ ఇచ్చేయడంపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. వేధింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కోవడం వల్లనే `హౌస్ ఫుల్ 4` నుంచి సాజిద్ తప్పుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.