Begin typing your search above and press return to search.
మీటూ : బిగ్ బి పై కూడా పిడుగు పడనుందా?
By: Tupaki Desk | 13 Oct 2018 6:50 PM GMTబాలీవుడ్ సీనియర్ నటుడు, జాతీయ అవార్డు గ్రహీత నానా పటేకర్ పై తనూశ్రీ దత్తా సంచలన ఆరోపణలు చేసిన తర్వాత అదే దారిలో పలువురు తమకు ఎదురైన లైంగిక దాడిని మీడియా ముందుకు తీసుకు వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా చెప్పుకోలేకుండా ఉన్న విషయాలను ఇప్పుడు ఎంతో మంది మహిళలు, బాలీవుడ్ ఫీమెయిల్ సెలబ్రెటీలు మీడియా ముందుకు తీసుకు వస్తున్నారు. తనూశ్రీ దత్తాకు మద్దతు పలుకుతూనే పలువురు మీటూ అంటూ తమకు ఎదురైన అనుభవాలను చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు పెద్ద మనుషుల బండారాలు బయటకు వస్తున్నాయి. ఇదే సమయంలో అమితాబ్ గురించి కూడా ఏదైనా షాకింగ్ విషయం వినాల్సి వస్తుందా అనే ఆందోళన ఆయన అభిమానుల్లో వ్యక్తం అవుతుంది.
తనూశ్రీ దత్తా విషయంలో బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు స్పందించారు. కాని అమితాబ్ స్పందించలేదు అంటూ కొందరు విమర్శలు చేశారు. తనూశ్రీ దత్తా కూడా తన విషయంలో బిగ్ బి స్పందించక పోవడంతో ఒకింత అసహనం వ్యక్తం చేసింది. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో అమితాబ్ సోషల్ మీడియా ద్వారా మీటూ ఉద్యమానికి మద్దతు పలికాడు. ఆడవారు పని చేసే ప్లేస్ లో భద్రత తప్పనిసరిగా ఉండాలని, అలా లేకుంటే దేశానికే మచ్చ అంటూ పోస్ట్ చేశాడు. అమితాబ్ పోస్ట్ కు ప్రముఖ హెయిర్ స్టైలిష్ట్ సప్నా మోతీ భవ్నానీ విభిన్నంగా స్పందించారు.
ఆమె అమితాబ్ ట్వీట్ కు సమాధానంగా.. మీరు మాట్లాడినది పెద్ద అబద్దం, మీ పింక్ సినిమా వచ్చి పోయింది, దాంతో మీకున్న సామాజిక వేత్త అనే మంచి పేరు కూడా పోయింది. మీ గురించిన నిజాలు త్వరలో బయటకు వస్తాయి. నా ఈ ట్వీట్ చూస్తూ మీరు గోళ్లు కొరుకుతూ ఉంటారు. అయితే ముందు ముందు మీరు కొరుక్కునేందుకు గోళ్లు కూడా ఉండవు అంటూ పోస్ట్ చేసింది. సప్నా ట్వీట్ తో బాలీవుడ్ లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. అమితాబ్ గురించి ఏ సమయంలో ఎలాంటి పిడుగు లాంటి వార్త వినాల్సి వస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వైపు బిగ్ బి అభిమానులు సప్నా ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.