Begin typing your search above and press return to search.
కొప్పు కొప్పు పట్టుకుని గుంజుకునేవారే!
By: Tupaki Desk | 8 Oct 2018 11:52 AM GMTఎంకి చావు సుబ్బికొచ్చినట్టుంది ఈ తంతు! అసలు ఏమాత్రం తమకు సంబంధం లేని గొడవ తమ మధ్య చిచ్చు పెట్టడమేంటో కానీ - ఇప్పటికైతే ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు కొప్పు కొప్పు పట్టుకుని కొట్టుకున్నంత పని చేశారు. ఎదురెదురు పడితే అంతే జరిగేదేమో! ఎదురు పడలేదు కాబట్టి మాటలతో సరిపుచ్చుకున్నారంతే! అసలింతకీ ఏమైంది? ఎవరి మధ్య ఈ గొడవ అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
గత కొంతకాలంగా బాలీవుడ్ కథానాయిక తనూశ్రీ దత్తా - నానా పటేకర్ మధ్య వివాదం దావానలంలా ప్రపంచాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ నటుడు నానా తనని లైంగికంగా వేదించాడని తనూశ్రీ ఆరోపించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో మీ-టూ ఉద్యమానికి మరోసారి ఊపొచ్చింది. తనూశ్రీకి బాసటగా నిలిచి కొందరు - వ్యతిరేకంగా కొందరు మాట్లాడుతుండడంతో ఇది రకరకాల వివాదాలకు కారణమవుతోంది. తాజాగా ఇదే వివాదం క్వీన్ కంగన రనౌత్ - సోనమ్ మధ్య వివాదానికి కారణమైంది.
కంగన ఇటీవలే స్టార్ డైరెక్టర్ వికాస్ బెహల్ పై పెనుదుమారం రేపే కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అతడు విష్ చేసే పేరుతో తనని గట్టిగా కౌగిలించుకుని తన మెడపై తల ఆన్చి తలవెంట్రుకలు వాసన చూసేవాడని కంగన చెప్పింది. విడిపించుకోవాలంటే వదిలేవాడే కాదని, తన వాసన నచ్చుతుందని అనేవాడని కంగన బహిరంగంగా వాపోయింది. అయితే కంగన కామెంట్ కి వికాస్ తరపున సోనమ్ అదిరిపోయ కౌంటర్ ఇచ్చింది. కంగన మాట్లాడేది ప్రతిసారీ నమ్మలేం. అయితే తన స్టాండ్ తనకు ఉంటుంది. ఆ విషయంలో తనని మెచ్చుకోకుండా ఉండలేను అంటూ పుండు మీద కారం చల్లింది అమ్మడు. దీనికి వెంటనే స్పందించిన కంగన తనదైన శైలిలో శివంగిలా విరుచుకుపడింది. నాకు నీలా వారసత్వం లేదు. పదేళ్లు కష్టపడి పరిశ్రమలో రాణించాను.. అంటూ చెడామడా కడిగేసింది. నా అనుభవాల్ని చెప్పాను. నన్ను జడ్జ్ చేయడానికి తనెవరు? అంటూ సోనమ్ పై విరుచుకుపడింది. దీన్నిబట్టి ఇదివరకూ నటవారసత్వం (నెప్టోయిజం)పై కంగన కామెంట్లు చేసినప్పటినుంచి సోనమ్ లో పగ రగులుతోందని అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఈ సీక్వెన్స్ ఎటు దారి తీస్తోందో అర్థంకాని సన్నివేశం నెలకొంది.