Begin typing your search above and press return to search.
‘ఎన్టీఆర్’ కంటే ముందు ‘ఎంజీఆర్’
By: Tupaki Desk | 24 Oct 2017 5:00 PM GMTదిగ్గజ నటుడు.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత కథతో తెలుగులో ఒకటికి రెండు సినిమాలు తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఓవైపు నందమూరి బాలకృష్ణ.. మరోవైపు రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంపై సినిమాలు చేయడానికి చురుగ్గా సన్నాహాలు చేస్తున్నారు. ఐతే అవి మొదలవడాని కంటే ముందు తమిళంలో ఎన్టీఆర్ తో సమానమైన ఇమేజ్ ఉన్న ఓ లెజెండ్ జీవిత చరిత్ర వెండితెరకు ఎక్కబోతోంది. ఆ లెజెండ్ మరెవరో కాదు.. ఎం.జి.రామచంద్రన్. ఎన్టీఆర్ లాగే సినీ రంగంలో గొప్ప స్థాయిని అందుకుని.. ఆపై రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు ముఖ్యమంత్రి జనాల హృదయాల్ని గెలిచిన ఎంజీఆర్ జీవిత కథతో సినిమా తీయడానికి రంగం సిద్ధమైంది.
‘బాహుబలి’లో కట్టప్పగా గొప్ప అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న సత్యరాజ్.. ఎంజీఆర్ పాత్రను చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. సీనియర్ దర్శకుడు బాలకృష్ణన్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఎంజీఆర్ పాత్రకు పలువురు నటుల్ని పరిశీలించి.. చివరికి సత్యరాజ్ ను ఓకే చేశారట. సత్యరాజ్ ఎంజీఆర్ గా కనిపించేందుకు అవసరమైన హోం వర్క్ చేస్తున్నారట. నవంబరు 8న ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే పార్టీ తరఫున ఆర్థిక సహకారం అందుతుందట. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారని సమాచారం.