Begin typing your search above and press return to search.

మియా ఖలీఫాది ఎంత మంచి మనస్సో..!

By:  Tupaki Desk   |   19 Aug 2020 11:30 PM GMT
మియా ఖలీఫాది ఎంత మంచి మనస్సో..!
X
ఇంటర్నెంట్‌ గురించి కనీసం అవగాహణ ఉన్న వారికి కూడా మియా ఖలీఫా పేరు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈమె కొంత కాలమే ఆ అడల్ట్‌ ఇండస్ట్రీలో ఉన్నా కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరును అయితే సంపాదించుకుంది. ఈమె అందంతో పాటు మంచి మనసు కూడా ఉందని తాజాగా నిరూపించుకుంది. ఇప్పటికే ఈమె ఆ ఇండస్ట్రీని వదిలేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం సన్నీలియోన్‌ మాదిరిగా గౌరవ ప్రథమంగా అలాంటి వాటి జోలికి వెళ్లకుండా హుందాగా బతుకుతుంది.

ఇలాంటి సమయంలో ఆమె నన్ను బుక్‌ చేసుకోండి అంటూ సోషల్‌ మీడియాలో ఇచ్చిన ఒక ప్రకటన చర్చనీయాంశం అయ్యింది. ఆమె ఇలాంటి ప్రకటన చేయడంతో మళ్లీ ఆమెలో మార్పు వచ్చిందా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆమె బుక్‌ చేసుకోండి యాడ్‌ వెనుక వేరే కథ ఉంది. కొన్ని రోజుల క్రితం లెబనాన్‌ లోని బైరూత్‌ లో చోటు చేసుకున్న బాంబు పేలుడు వల్ల వేలాది మంది నష్టపోయిన విషయం తెల్సిందే. వారికి సాయం చేసేందుకు గాను మియా ఖలీఫా ముందుకు వచ్చింది.

రెడ్‌ క్రాస్‌ సొసైటీతో కలిసి ఈమె ఛారిటీ కార్యక్రమంలో భాగంగా సోషల్‌ మీడియాలో ఫాలోవర్స్‌ కు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. డబ్బులు ఇచ్చి తనను బుక్‌ చేసుకుంటే వారు ఎవరికి అయినా బర్త్‌ డే విషెష్‌ చెప్పాలనా లేదంటే మాజీ ప్రియుడు లేదా ప్రేయసితో మాట్లాడాలన్నా కూడా తాను మాట్లాడుతాను అంటూ ప్రకటనలో పేర్కొంది. అందుకోసం ఈమె కాస్త ఎక్కువగానే ఛార్జ్‌ చేస్తుంది. వచ్చిన ప్రతి పైసాను కూడా రెడ్‌ క్రాస్‌ వారికి ఇవ్వబోతున్నట్లుగా ఆమె పేర్కొంది. లెబనాన్‌ బాధితుల కోసం ఆమె మంచి మనసుతో ఈ పని చేయడం నిజంగా అభినందనీయం.