Begin typing your search above and press return to search.

మేరీ మాతగా పోర్న్ స్టార్.. గొడవ గొడవ

By:  Tupaki Desk   |   23 Oct 2017 8:37 AM GMT
మేరీ మాతగా పోర్న్ స్టార్.. గొడవ గొడవ
X
మియా ఖలీఫా.. పోర్న్ వీడియోలు చూసేవాళ్లకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. కేవలం పోర్న్ సినిమాల్లో నటించడంతోనే కాక అనేక వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తుంటుంది మియా. ఒక పోర్న్ సినిమాలో బురఖా ధరించి నటించడం అప్పట్లో పెద్ద వివాదానికే దారి తీసింది. ఆమెను చంపేస్తామంటూ ఐసిస్ ప్రకటన కూడా చేసింది. తాజాగా ఓ మతపరమైన వివాదం మియా మెడకు చుట్టుకుంది. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన ఫొటో దుమారం రేపుతోంది. ఆ ఫొటోలో మేరీ మాత లాగా మియా ఖలీఫాను మార్ఫింగ్ చేశారు. ఇది ఓ న్యూస్ ఔట్లెట్ ప్రచురించిన ఫొటో అని ఆమె తెలిపింది.

ఐతే ఆ ఫొటోను మార్ఫింగ్ చేసింది ఎవరైనప్పటికీ ఒక పోర్న్ స్టార్ అయిన మియా ఖలీఫాను మేరీ మాతగా చూపించడంపై సోషల్ మీడియాలో జనాలు మండిపడ్డారు. నిన్ను నువ్వు మేరీ మాతగా ఊహించుకుంటావా అని అందరూ మియా మీద పడ్డారు. ఈ ఫొటో తయారు చేసిన వాళ్లు ఎవరో ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మియా ఖలీఫా పేరు మరో వివాదంలో వినిపించింది. పాకిస్థాన్ కు చెందిన ఉద్యమకారిణి.. నోబెల్ బహుమతి గ్రహీత మలాలా ఇటీవలే తాను చదువుకునే యూనివర్శిటీలో తరగతులకు జీన్స్.. హైహీల్స్ ధరించి రావడం వివాదాస్పదమైంది. ఆమె మలాలానా.. మియా ఖలీఫానా అంటూ కామెంట్లు చేశారు జనాలు.