Begin typing your search above and press return to search.

మూర్తి గారూ ఇది బాగా ఓవర్ సార్

By:  Tupaki Desk   |   28 July 2017 1:45 PM GMT
మూర్తి గారూ ఇది బాగా ఓవర్ సార్
X
మామూలుగా కొంతమంది పెద్ద పెద్ద నటులంటే చాలా గౌరవం ఉంటుంది. ఎందుకంటే వారు ఒక మాట అన్నారంటే మాత్రం దానికి తిరుగుండదు. అయితే కొన్నిసార్లు వారు అనే మాటలు చాలా చిక్కుల్లో పడేస్తాయి. అదిగో అప్పట్లో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్ కొన్ని కామెంట్లు చేసి ఏకంగా ఇండస్ర్టీకి కొన్నిరోజులపాటు దూరమయ్యాడు. ఇప్పుడు అలాంటి సంచలన కామెంట్లు చేయకపోయినా.. మూర్తి గారు మాత్రం ఇండస్ట్రీ ఉలిక్కిపడే కామెంట్ ఒకటి చేశారు.

రెబెల్ నటుడిగా కేవలం ఎర్ర సైన్యం వంటి సినిమాల్లో కనిపించడమేకాదు.. అసలు జీవితంలో కూడా ఆయనో పెద్ద రెబెల్. కృష్ణానగర్ లో చిన్న రూములో ఉంటూ.. కనీసం లిఫ్ట్ ఇస్తానన్నా కూడా ఎవరి బండీ ఎక్కని గొప్ప వ్యక్తి ఆర్.నారాయణమూర్తి. గత సాయంత్రం ఆయన ఫిదా సినిమా వాళ్ళు నిర్వహించిన ఫిదా సంబరాలు కార్యక్రమానికి వచ్చాడు. ఆ సందర్భంగా ఆయన తనకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని చెప్పాడు. కాకపోతే అక్కడితో ఆగకుండా.. తనకు అల్లు అర్జున్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని.. కాబట్టి లెజండరీ సింగర్ డ్యాన్సర్ కంపోజర్ అయిన మైఖేల్ జాక్సన్ జీవితగాథను అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించాలని ఆయన దిల్ రాజు అండ్ అల్లు అరవింద్ లను కోరాడు. కాకపోతే ఈ కామెంట్లు వింటే ఏమనిపిస్తోంది?

నిజానికి మైఖేల్ జీవితాన్ని తెరకెక్కించాలంటే హాలీవుడ్డే అరెకరం తడిపేసుకుంటోంది. ఒక నల్లజాతీయుడు.. క్రమంగా ఒక సూపర్ స్టార్ గా ఎదిగి.. అక్కడి నుండి సర్జరీలు చేయించుకుని తెల్లగా ఎలా మారాడు అనే కథను చెప్పాలంటే అసలు ఎంత గట్స్ అండ్ గ్లోరి కావాలో చూడండి. మరి అల్లు అర్జున్ ను పెట్టి ఆ సినిమాను ఎవరు తీస్తారు ఇక్కడ? అసలు బన్నీ ఆ పాత్రకు సరిపోతాడా? కేవలం డ్యాన్స్ వస్తే మైఖేల్ సినిమాలో హీరో అంటే ఎలా? పైగా అన్నీ తెలిసిన మూర్తిగారు ఇలాంటి కామెంట్లు చేయడమేంటి ఓవర్ కాకపోతే... ఇలా సోషల్ మీడియాలో పంచులు పేలిపోతున్నాయ్. కాని మూర్తి గారు తన అభిమానాన్ని అలా చాటుకున్నారు.