Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : మైకేల్
By: Tupaki Desk | 4 Feb 2023 9:27 AM GMT'మైకేల్' మూవీ రివ్యూ
నటీనటులు: సందీప్ కిషన్-దివ్యాంశ కౌశిక్-గౌతమ్ వాసుదేవ్ మీనన్-విజయ్ సేతుపతి-అయ్యప్ప పి.శర్మ-అనసూయ భరద్వాజ్-వరలక్ష్మి శరత్ కుమార్-అనీష్ కురువిల్లా తదితరులు
సంగీతం: శ్యామ్ సి.ఎస్
ఛాయాగ్రహణం: కిరణ్ కౌశిక్
మాటలు: కళ్యాణ చక్రవర్తి
నిర్మాతలు: భరత్ చౌదరి-రామ్మోహనరావు పుస్కూరు
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రంజిత్ జయకొడి
కెరీర్ ఆరంభంలో నటుడిగా మంచి పేరు సంపాదించడమే కాక.. హీరోగా 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' లాంటి మంచి హిట్టు కూడా కొట్టి ఉపు మీద కనిపించాడు సందీప్ కిషన్. కానీ ఆ తర్వాత తనపై పెరిగిన అంచనాలను అతను అందుకోలేకపోయాడు. వరుసబెట్టి సినిమాలు చేస్తున్నా సరైన హిట్టు మాత్రం పడట్లేదు. ఇప్పుడతను 'మైకేల్'గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళంలో పెద్ద కాస్ట్ అండ్ క్రూతో.. పెద్ద బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది. ప్రోమోల్లో చాలా ప్రామిసింగ్ గా కనిపించిన ఈ చిత్రమైనా సందీప్ కరవు తీర్చేలా ఉందేమో చూద్దాం పదండి.
కథ:
చిన్నతనంలోనే అనాథగా మారిన మైకేల్ (సందీప్ కిషన్).. తన తల్లిని మోసం చేసిన తండ్రిని చంపడమే లక్ష్యంగా ముంబయిలో అడుగు పెడతాడు. అప్పటికే అక్కడ పెద్ద డాన్ గా ఎదిగిన గురునాథ్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) అతణ్ని చేరదీస్తాడు. పెరిగి పెద్దవాడయ్యాక గురునాథ్ ప్రాణాపాయంలో ఉండగా ఓసారి.. ఒక కేసు విషయంలో మరోసారి రక్షిస్తాడు మైకేల్. దీంతో అతడిపై గురుకి గురి కుదురుతుంది. తన మీద ఎటాక్ చేసిన వ్యక్తుల్లో ఒక్కొక్కరిని చంపుకుంటూ వెళ్లిన గురు.. చివరి వ్యక్తితో అతడి కూతురిని కూడా చంపే బాధ్యతను మైకేల్ కు అప్పగిస్తాడు. ఆ మిషన్ మీద ఢిల్లీకి వెళ్లిన మైకేల్.. తాను చంపాల్సిన వ్యక్తి కూతురు తీర (దివ్యాంశ)తోనే ప్రేమలో పడతాడు. మరి గురు చెప్పినట్లు అతను తీర తండ్రిని చంపాడా.. లేక తీర కోసం అతణ్ని వదిలేశాడా.. అతను తీసుకున్న నిర్ణయంతో ఎదురైన పరిణామాలేంటి.. ఇంతకీ మైకేల్ తండ్రి ఎవరు.. అతణ్ని మైకేల్ చంపాడా లేదా.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
ఓపెన్ చేయగానే చాలామంది రౌడీలు కలిసి ఒక వ్యక్తిని కొడుతుంటారు. ఎక్కడున్నాడు వాడు అని హీరో గురించి అడుగుతారు. అక్కడి నుంచి మొదలు.. హీరో వీరుడు శూరుడు అంటూ అతను చెప్పడం.. హీరో ఎంట్రీ ఇచ్చి ఎదురొచ్చిన ప్రతి ఒక్కరినీ చితకబాదడం. అతను మామూలోడు కాదు అగ్నిపర్వతం అంటాడు ఒకడు. అతడి దెబ్బ రుచిచూశావా అంటాడు ఇంకొకడు. అతడి రక్తంలో వేడి చూశావా అంటాడు మరొకడు. ఇలా సీన్లోకి వచ్చే ప్రతి కొత్త వ్యక్తీ హీరోకు ఎలివేషన్ ఇవ్వడమే సరిపోతుంది. హీరో ప్రతి పది నిమిషాలకూ ఒక ఫైట్ చేస్తూ.. చిన్నపిల్లలు దీపావళికి పేల్చినట్లు తుపాకీ పట్టుకుని పేల్చుకుంటూ పోతుంటాడు. అతడికి ఎలివేషన్ ఇవ్వడానికి తెర వెనుక మ్యూజిక్ డైరెక్టర్.. కెమెరామన్.. ఇతర సాంకేతిక నిపుణులు రెడీగా ఉంటారు. తెరమీద ఏదో అద్భుతం జరిగిపోతున్నట్లు టెక్నీషియన్స్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. సింపుల్ గా చెప్పాలంటే కేవలం ఎలివేషన్లు మాత్రమే 'కేజీఎఫ్'ను అంత పెద్ద హిట్ చేశాయేమో అన్న భ్రమతో చేసిన వృథా ప్రయత్నం 'మైకేల్'.
'కేజీఎఫ్'ను చూసి వాత పెట్టుకున్న సినిమాలు ఇప్పటికే కొన్ని చూశాం. 'మైకేల్' ఆ జాబితాలో ముందు వరుసలో నిలుస్తుంది. 90ల నేపథ్యం.. మాఫియా కథ.. విజువల్స్.. బ్యాగ్రౌండ్ స్కోర్.. హీరో పాత్ర చిత్రణ.. అతడి ఎదుగుదల.. ఇలా ప్రతి విషయంలోనూ 'కేజీఎఫ్'ను అనుకరిస్తూ సాగిన సినిమా ఇది. ఐతే 'కేజీఎఫ్'లో ఎలివేషన్లు కొన్నిసార్లు మరీ శ్రుతి మించినా సరే.. ఆ ఎలివేషన్లకు ముందు బిల్డప్ అనేది కరెక్ట్ మీటర్లోనే ఉంటుంది. ఊరికే హీరో స్టైలిష్ గా కనిపించడం వల్లో.. ఫైట్లు చేసేయడం వల్లో ఎలివేషన్ పండదు. ముందు హీరో పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడాలి. ఒక యాక్షన్ సీక్వెన్స్ మొదలవుతుంటే హీరో ఇప్పుడు కొడితే బాగుండు అనిపించాలి. అతను కొడుతుంటే మజా రావాలి. హీరోయిజాన్ని ప్రేక్షకులు ఫీలవ్వాలి. ఏ సినిమాకైనా వర్తించే సూత్రమిది. కానీ 'మైకేల్' దర్శకుడు రంజిత్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా హీరోతో అదే పనిగా ఫైట్లు మాత్రమే చేయించాడు. ఎంతసేపూ హీరో పాత్రను.. సన్నివేశాలను స్టైలిష్ గా ప్రెజెంట్ చేయాలని చూశాడే తప్ప సరైన పాత్ర చిత్రణ లేదు. సన్నివేశాల్లో బలం లేదు.
90ల నాటి కథగా చూపించి హీరో హీరోయిన్లకు ఇప్పటి తరహాలో స్టైలిగ్ చేయించడం దగ్గరే 'మైకేల్' మిస్ ఫైర్ అనే విషయం అర్థమైపోతుంది. దర్శకుడు సినిమాలో ప్రతిదీ 'స్టైల్'గా ఉండాలని చూసుకున్నాడే తప్ప కథాకథనాలు పకడ్బందీగా తీర్చిదిద్దుకోవడం గురించి ఆలోచించలేదు. అనాథగా పెరిగిన కుర్రాడు.. ఒక మాఫియా డాన్ దగ్గర అండర్ డాగ్ గా మొదలుపెట్టి ఆ డాన్ ను ఢీకొట్టే స్థాయికి ఎదిగిపోవడం.. ఈ లైన్ మీద పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. గౌతమ్ మీనన్ చివరి సినిమా 'ముత్తు' కూడా ఇదే లైన్లో సాగే సినిమానే. గ్యాంగ్ స్టర్ సినిమాలంటేనే దాదాపుగా ఇలాంటి కథలతోనే తెరకెక్కుతాయి. ఐతే లైన్ రొటీన్ అనిపించినా.. కథనంలో వైవిధ్యం-ఆసక్తి ఉంటే ఎన్నిసార్లయినా ఇవే కథలను చూస్తారు ప్రేక్షకులు. కానీ 'మైకేల్'లో ఎక్కడా కూడా కొత్తదనం.. ఆసక్తి అన్నవి కనిపించవు.
విపరీతమైన బిల్డప్ తో మొదలై కాసేపటికే తుస్సుమనిపించే ఆరంభ సన్నివేశాలతోనే ప్రేక్షకులు ఈ సినిమాతో డిస్కనెక్ట్ అయిపోతారు. ముందుకు సాగేకొద్దీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది 'మైకేల్'. ప్రోమోల్లో విజయ్ సేతుపతి కూడా కనిపించడంతో అతనెప్పుడు వస్తాడా అని కొంతసేపు ఎదురు చూస్తాం కానీ.. తెర మీద జరిగే తంతు చూశాక ఇక అతను వచ్చినా మార్పేమీ ఉండదన్న నిస్పృహ వచ్చేస్తుంది. పూర్తిగా గ్రాఫ్ పడిపోయాక సేతుపతి రంగప్రవేశం చేసినా ఫలితం లేకుండా పోయింది. సినిమా ఎటు పోతోందన్న విషయం పక్కన పెట్టేస్తే తప్ప సేతుపతి కనిపించే రెండు మూడు సన్నివేశాలను ఎంజాయ్ చేయలేం. కథలో కొన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ.. చివరికి అవి వెల్లడయ్యే సమయ ానికి పూర్తిగా నీరసం ఆవహించేసి ఉండడంతో వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. బిల్డప్ తప్ప విషయం లేని 'మైకేల్'తో ఏ వర్గం ప్రేక్షకులు కూడా కనెక్ట్ కాలేరన్నది స్పష్టం.
నటీనటులు:
సందీప్ కిషన్ మైకేల్ పాత్రలో చూడ్డానికి బాగున్నాడు. అతను తన లుక్ మీద బాగానే దృష్టిపెట్టాడు. చేసింది రౌడీ పాత్రే కానీ.. అందులో స్టైలిష్ గా కనిపించాడు. పెర్ఫామెన్స్ కూడా ఓకే. నటన పరంగా అతడికి పరీక్ష పెట్టే.. ప్రత్యేకంగా అనిపించే పాత్రయితే కాదు ఇది. హీరోయిన్ దివ్యాంశ అందంగా కనిపించింది. ఆ పాత్రలో విషయం లేదు. విజయ్ సేతుపతి కనిపించిన కాసేపు తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు. కీలక పాత్రలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ జస్ట్ ఓకే అనిపించాడంతే. ఆ పాత్రలో కూడా బిల్డప్ తప్ప విషయం లేకపోయింది. గౌతమ్ ను వాడుకుంటే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్ని బాగా చేయగలడనిపిస్తుంది కానీ.. ఇందులో మాత్రం దర్శకుడు అతణ్ని సరిగా వాడుకోలేదు. వరలక్ష్మి చిన్న పాత్రలో కాసేపు మెరిసింది. అనసూయ పాత్ర చాలా సాధారణంగా అనిపిస్తుంది. తన పాత్రకు పెట్టిన డైలాగులు ఓవర్ గా అనిపిస్తాయి. అయ్యప్ప పి.శర్మ బాగా చేశాడు.
సాంకేతిక వర్గం:
బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మంచి పేరున్న శ్యామ్ సి.ఎస్.. 'మైకేల్'లో విషయం లేని సన్నివేశాలను పైకి లేపడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ ఆర్ఆర్ తో అతనిచ్చే బిల్డప్ కి.. సన్నివేశాల్లో ఉన్న కంటెంట్ కి అసలు సంబంధం లేదు. అతడి పాటలు పర్వాలేదు. కెమెరామన్ కిరణ్ కౌశిక్ సైతం రిచ్ విజువల్స్ తో ఆకట్టకున్నాడు. 90ల నేపథ్యాన్ని తెర మీద బాగానే చూపించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. కానీ సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నా.. పేరున్న ఆర్టిస్టులున్నా.. సినిమా భరించలేని విధంగా తయారైందంటే 'మైకేల్' బోల్తా కొట్టేసిందంటే అది రైటర్ కమ్ డైరెక్టర్ రంజిత్ జయకొడి లోపమే. అతడి టేకింగ్ మాత్రం స్టైలిష్ గా ఉంది తప్ప.. మిగతా ఎందులోనూ మెప్పించలేకపోయాడు. సాధారణమైన కథాకథనాలు.. విపరీతమైన బిల్డప్ తప్ప విషయం లేని నరేషన్ తో అతను 'మైకేల్' నీరుగారిపోయేలా చేశాడు. అసలు దర్శకుడు ఏం చెప్పి ఇంతమంది పేరున్న ఆర్టిస్టులను ఒప్పించి.. నిర్మాతలతో అంత ఖర్చు పెట్టించి సినిమా చేయగలిగాడో అన్న సందేహం కలుగుతుంది చివరికి.
చివరగా: మైకేల్.. మిస్ ఫైర్
రేటింగ్-2/5