Begin typing your search above and press return to search.

రానా గారి సుందరి.. కిర్రాక్ లుక్

By:  Tupaki Desk   |   20 Jun 2023 11:03 PM IST
రానా గారి సుందరి.. కిర్రాక్ లుక్
X
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు రానా దగ్గుబాటి. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు బాహుబలితో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇటీవల రానా నాయుడు పేరిట చేసిన వెబ్ సిరీస్ విపరీతంగా ఆకట్టుకుంది. తొలిసారి తన బాబాయి వెంకటేష్ తో కలిసి అందులో నటించారు. కొంచెం బూతులు ఎక్కువైనా, కాన్సెప్ట్ చాలా మందిని ఆకట్టుకుంది.

ఈ సంగతి పక్కన పెడితే, రానా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన భార్య మహిక కూడా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న ఈ బ్యూటిఫుల్ కపుల్ లండన్ ట్రిప్ కి వెళ్లిన ఫోటోలను కూడా షేర్ చేశారు. కాగా, తాజాగా మహిక మరోసారి తన ఫోటోలు షేర్ చేసి ఆకట్టుకుంది.

మహిక కి ఫ్యాషన్ సెన్స్ చాలా ఎక్కువ. తన డ్రెస్సింగ్ స్టైల్ తో ఎప్పుడూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. తాజాగా, ఆమె తన బ్యూటిఫుల్ క్లిక్స్ తో అందరి మతులు పోగొట్టింది. హాఫ్ షోల్డర్ టాప్, మినీ స్కర్ట్ లాంటి డ్రెస్ లో మెరిసింది. నీలం రంగు ఫ్లోరల్ డ్రెస్ లో ఆమె అల్ట్రా లుక్ లో మెరవడం విశేషం.

ఈ ఫోటోలు ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ డిజైనర్ వేర్ డ్రెస్ లో ఆమె లుక్ కి అందరూ ఫిదా అయిపోతున్నారు. హీరోయిన్ కి ఏ మాత్రం తక్కువ లేరు మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సూపర్ హాట్ ఉన్నారని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె నడుము కొంచెం పైకి టాటూ కూడా ఉంది. ఆ టాటూ ఏంటి అనేది అర్థం కావడం లేదు. దీంతో, అది ఏమై ఉంటుందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు నెటిజన్లు.మహికాను మోడ్రన్ లుక్ లో చాలాసార్లు చూశాం. కానీ ఇంత ట్రెండీ లుక్ లో చూడటం ఇదే తొలిసారి కావచ్చు. అందుకే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.

ఇక రానా విషయానికి వస్తే, రానా నాయుడు వెబ్ సిరీస్ కి రెండో భాగం కూడా త్వరలో రాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం రానా చేతిలో రాక్షసరాజు అనే సినిమా ఉంది. మరో వైపు డైరెక్టర్ తేజతో నేనే రాజు నేనే మంత్రి లాంటి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.