Begin typing your search above and press return to search.

నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న రానా - మిహీకాల మరో ఫోటో...!

By:  Tupaki Desk   |   22 May 2020 11:30 AM GMT
నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న రానా - మిహీకాల మరో ఫోటో...!
X
ఇటీవల దగ్గుబాటి రానా - మిహీకా బజాజ్‌ ల రోకా ఫంక్షన్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి - బజాజ్ ఇరు కుటుంబ సభ్యులు హాజరైనట్లు సమాచారం. ప్రస్తుతం వీరి రోకా కార్యక్రమం ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే అక్కినేని సమంత వీరికి సంభందించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ క్రమంలో మిహీకా కూడా రానాతో‌ సన్నిహతంగా ఉన్న పలు ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్‌ చేశారు. ఇందులో రానా మిహికాని దగ్గరకు తీసుకుంటూ ఆమె చెవిలో ఏదో చెప్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ.. ''మై హ్యాపీ ప్లేస్'' అంటూ కామెంట్ జత చేసి షేర్‌ చేశారు. ఇక మిహీకా పోస్టుకు హీరో వెంకటేష్‌ కూతురు అశ్రిత ''పట్టలేనంత సంతోషంగా ఉంది. నేను అక్కడ లేనన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, మీ ఇద్దరికి నా పెద్ద హగ్‌'' అంటూ కామెంట్‌ చేశారు. బెస్ట్ కపుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా రానాతో ఉన్న మరో ఫొటోను షేర్‌ చేస్తూ.. ''ఇది ఆరంభం...ఇక ఎప్పటికీ'' అనే క్యాప్షన్‌ కు హార్ట్‌ ఎమోజీలను జత చేసింది మిహికా. ప్రస్తుతం సోషల్ మీడియాలో రానా - మిహికా ఫోటోలు వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా మిహీకా తన ప్రేమను అంగికరించిందని రానా తన ప్రేమను సోషల్‌ మీడియాలో అధికారింగా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు కూడా గ్రీన్‌ సిగ్నిల్‌ ఇవ్వడంతో వీరిద్దరి ఎంగేజ్ మెంట్ - పెళ్లి వేడులకు ముహుర్తం ఖారారు చేసేందుకు రామనాయుడు స్టూడియోలో రోకా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంభందించిన ఫోటోలు బయటకి వచ్చాయి. దీంతో వీరిద్దరికి బాలీవుడ్‌ టాలీవుడ్‌ కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమల ప్రముఖుల నుంచి సోషల్‌ మీడియాలో శుభకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.