Begin typing your search above and press return to search.
సరబ్ జిత్ కూతురి పెళ్లి ఖర్చులు.. సింగర్ వే
By: Tupaki Desk | 9 May 2016 5:15 AM GMTసరబ్ జిత్.. మే 20న విడుదల కానున్న బాలీవుడ్ ఇది. ఇండో-పాక్ బోర్డర్ లో నివసించే సరబ్ జిత్ సింగ్ అనే రైతు పాక్ జైల్లోనే మగ్గి చనిపోవడం.. అతని విడుదల కోసం సోదరి దల్బీర్ ఎన్నో రకాలుగా ప్రయత్నించడమే ఈ మూవీ స్టోరీ. సరబ్ జిత్ లో దల్బీర్ పాత్రను ఐశ్వర్యారాయ్ బచ్చన్ చేయడం, సరబ్ జిత్ రోల్ ను రణ్ దీప్ హుడా పోషించడంతో.. బోలెడన్ని అంచనాలు పెరిగిపోయాయి. మరో పది రోజుల్లో విడుదల కూడా ఉండడంతో.. ఇప్పుడు ప్రమోషన్ వర్క్స్ కూడా ఊపందుకున్నాయి.
సరబ్ జిత్ విడుదల కోసం ప్రయత్నాల్లో భాగంగా.. దల్బీర్ ఎంతో మందిని సాయం అర్థించింది. అందులో షంషేర్ సింగ్ కూడా ఒకరు. జంతర్ మంతర్ దగ్గర ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నాడు షంషేర్. ఇప్పుడు మికా సింగ్ కూడా సరబ్ జిత్ కుటుంబానికి సాయం అందించేందుకు ముందుకొచ్చాడు. సరబ్ జిత్ చిన్న కూతురు పూనమ్ పెళ్లి ఖర్చులు పూర్తిగా తానే భరిస్తానని చెప్పాడు సింగర్ కం కంపోజర్ మికా సింగ్.
పూనమ్ ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకున్నా సరే.. ఖర్చులన్నీ తనవే అని చెప్పాడు మికా. ఈ బాలీవుడ్ సింగర్ చెప్పిన మాటకు.. సరబ్ జిత్ సోదరి దల్బీర్ తో పాటు ఆన్ స్క్రీన్ దల్బీర్ ఐశ్వర్యారాయ్, రణ్ దీప్ హుడాలు కూడా ఎమోషనల్ అయిపోయారు. ఇప్పుడు సరబ్ జిత్ బతికి లేకున్నా.. అతని కుటుంబాన్ని ఆదుకునేందుకు బాలీవుడ్ కదిలివస్తుండడం విశేషం.