Begin typing your search above and press return to search.

'లైగ‌ర్' పై భ‌లే స్టోరీలు అల్లుతున్నారే?

By:  Tupaki Desk   |   18 July 2022 1:30 AM GMT
లైగ‌ర్ పై భ‌లే స్టోరీలు అల్లుతున్నారే?
X
రౌడీస్టార్ విజ‌య్ క‌థానాయ‌కుడిగా పూరి జ‌గ‌న్నాధ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `లైగ‌ర్` రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. ఆగ‌స్టు 22న చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయ‌డానికి యూనిట్ స‌ర్వం సిద్దం చేస్తుంది. దాదాపు సినిమా ఫైన‌ల్ కాపీ రెడీ అయిన‌ట్లే .దీంతో యూనిట్ ప్ర‌చారం ప‌నులు మొద‌లు పెట్ట‌డానికి రెడీ అవుతోంది.

తెలుగు తో పాటు అన్ని భాష‌ల్లోనూ ప్రమోట్ చేయాలి కాబ‌ట్టి దానికి త‌గ్గ ప్ర‌ణాళిక‌తో టీమ్ దిగుతుంది. హైద‌రాబాద్..ముంబై...బెంగుళురూ..చెన్నై తో పాటు ఇంకా కీల‌క‌మైన ప్రాంతాల్లో ప్ర‌చారానికి అవ‌కాశం ఉంది. రౌడీని ని మ‌హేష్ రేంజ్ సూప‌ర్ స్టార్ ని చేయ‌డ‌మే పూరి టార్గెట్ కాబ‌ట్టి అందుకు త‌గ్గ ప‌బ్లిసిటీ కి తెర తీసే అవ‌కాశం ఉంది.

దీనిలో భాగంగా `లైగ‌ర్` ని ఓ రేంజ్ లో రిలీజ్ కి ముందు ప్ర‌మోట్ చేయ‌నున్నారు. మ‌రి `లైగ‌ర్` పీఆర్ టీమ్ ప్లానింగ్ ఎలా? ఉంద‌న్న‌ది తెలియ‌దు గానీ వెబ్ మీడియాలో సినిమాపై జ‌రుగుతోన్న ప్రచారం మాత్రం ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. `లైగ‌ర్` స్టోరీ ఇలా ఉంటుంది? అలా ఉంటుంది? అంటూ ర‌క‌ర‌కాల క‌థ‌నాలు..ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి.

పూరి ఎంచుకున్న బాక్సింగ్ పాయింట్ ని బేస్ చేసుకుని ఎవ‌రి ట్యాలెంట్ వాళ్లు చూపిస్తున్నారు. సినిమాలో బాక్సింగ్ దిగ్గ‌జం మైక్ టైస‌న్ సైతం కీల‌క పాత్ర పోషించ‌డంతో? మ‌రింత హైప్ క్రియేట్ అవుతుంది. విజ‌య్ పాత్ర‌కి-టైస‌న్ పాత్ర‌కి అద్భుత‌మైన సింక్ లింక్ చేస్తూ సినిమాకి కావాల్సినంత ప్ర‌చారం క‌ల్పిస్తున్నారు.

తాజాగా `లైగ‌ర్` సినిమా లైన్ ఇదేనంటూ ఓ విష‌యం నెట్టింట చ‌క్కెర్లు కొడుతుంది. టైస‌న్ ని రింగులో ఒడించి అత‌డితో సెల్పీ తీసుకోవ‌డ‌మే హీరో గోల్. అందుకోసం హీరో క్యారెక్ట‌రైజేష‌న్ ఏమాత్రం త‌గ్గ‌కుండా ప‌వ‌ర్ ఫుల్ గా సాగుతుంద‌ని అంటున్నారు. ఎన్నో అడ్డంకులు ఎదుర్కుని అమెరికా వెళ్లి ల‌క్ష్యాన్ని చేధిస్తాడ‌ని ఇదే లైగ‌ర్ సినిమా అంటున్నారు.

ఇంకొంత మంది టైస‌న్ విజ‌య్ తండ్రి పాత్ర‌లో..బాక్సింగ్ కోచ్ గా క‌నిపిస్తాడ‌ని అంటున్నారు. మ‌రికొంత మంది హాలీవుడ్ రేంజ్ లో ఉంటుంద‌ని...తెలుగు-హిందీ నేటివిటీని మిస్ కాకుండా ఆ స్థాయిలో తెర‌కెక్కించి ఉంటార‌ని గెస్ చేస్తున్నారు. మ‌రి ఇందులో వాస్త‌వం ఏంత‌? అవాస్త‌వం ఎంత‌? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత గానీ క్లారిటీ రాదు.

అయితే మ‌రీ టైస‌న్ నే ఓడించే ల‌క్ష్యం అన్న‌ది టూమ‌చ్ గా క‌నిపిస్తుంది. బాక్సింగ్ ప్ర‌పంచాన్నే శాషించిన దిగ్గ‌జాన్ని రింగ్ లో ఓడిస్తే? గ‌నుక అంత‌క‌న్నా పెద్ద కామెడీ పూరి ఇంత వ‌ర‌కూ చేయ‌న‌ట్లే అవుతుంది. పూరి వ్య‌క్తిగ‌తంగా ప్ర‌ముఖుల్ని ఎంతో గౌర‌విస్తారు. అలాంటి వాళ్ల గురించి ఎంతో గొప్ప‌గా చెబుతుంటారు. వాళ్ల‌ని మాత్ర‌మే స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఎద‌గాల‌ని లెక్చ‌ర్లు ఇస్తారు.

అలాంటి పూరి ఇలాంటి కామెడీలు చేయిస్తే పెద్ద సాహ‌స‌మే అవుతుంది. ఒక‌వేళ నిజ‌మే అనుకున్నా టైసన్ ముఖం మీద పంచ్ విసురుతానంటే ఒప్పుకుంటారా? సినిమా కోసం ప్ర‌తిష్ట‌నే ప‌ణంగా పెడ‌తారా? అన్న సందేహం రాక మాన‌దు. పైగా రోజులు త‌ర‌బ‌డి డేట్లు కేటాయించే అంత‌ స‌మయం టైస‌న్ ద‌గ్గ‌ర ఉండ‌దు. ఒక‌వేళ టైసన్ ఒప్పుకున్నా రిలీజ్ త‌ర్వాత‌ బాక్సింగ్ ప్రేమికులు రుద్ర‌తాండ‌వం ఆడేయ‌రు. మ‌రి పూరి సినిమాలో ఏం చెప్పాల‌నుకున్నాడు? టైస‌న్ ని ఎలా హైలైట్ చేస్తారు? అన్న‌ది రిలీజ్ త‌ర్వాత గాని క్లారిటీ రాదు.