Begin typing your search above and press return to search.

మైక్ టైసన్ పంచ్.. విజయ్ దిమ్మ తిరిగింది

By:  Tupaki Desk   |   20 Aug 2022 9:57 AM GMT
మైక్ టైసన్ పంచ్.. విజయ్ దిమ్మ తిరిగింది
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమాపై భారీ నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమాతో సక్సెస్ అందుకుంటేనే అతనను మరో స్థాయికి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇదే సినిమాతో పూరి జగన్నాథ్ కూడా మరో రేంజ్ కు వెళ్లాలని ఆలోచిస్తున్నాడు. అగ్ర హీరోలు అతన్ని ఇటీవల కాలంలో చాలా రిజెక్ట్ చేశారు కాబట్టి ఈ సినిమాతో సక్సెస్ అందుకుని మరిన్ని సినిమాలు చేయాలని ఆలోచనలో ఉన్నాడు.

అయితే ఈ సినిమా కోసం వీరిద్దరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా విజయ్ అయితే తన ఫిట్నెస్ లో చాలా మార్పులు తెచ్చాడు. ఇంతకుముందు వరకు విజయ్ చేసిన సినిమాలో ఒక లెక్క అయితే ఇప్పుడు ఈ సినిమా మరొక లెక్క.

విజయ్ సాధారణంగా కంటెంట్ అంతగా ఇంపాక్ట్ చూపించకపోతే ఏ దర్శకుడుతో అయినా సినిమాలు చేయడు. కాబట్టి అతని మీద నమ్మకంతో ఉన్న ఫ్యాన్స్ అయితే లైగర్ లో డిఫరెంట్ కంటెంట్ ఉంది అనే ఆశపడుతున్నారు.

ఇక సినిమా షూటింగ్స్ లో పాల్గొనే ముందు విజయ్ చాలాసార్లు వర్క్ షాప్ లో పాల్గొన్నాడట. అయితే మైక్ టైసన్ తో మాత్రం డైరెక్ట్ గా షూటింగ్ లొకేషన్లోనే కొన్ని సీన్స్ చేయాల్సి వచ్చింది. ఆయన చాలా బిజీ పర్సన్ కాబట్టి సినిమాకు ఓకే చెప్పడమే చాలా గొప్ప విషయం అని చిత్ర యూనిట్ ఈవెంట్లో తెలియజేసింది. ఇక అలాంటి మైక్ టైసన్ తో అమెరికా వెళ్ళగానే అక్కడ డైరెక్ట్ స్పాట్లోనే కొంత ట్రైనింగ్ తీసుకొని షూటింగ్ చేయాల్సి వచ్చింది.

ఇక రియల్ బాక్సారైన మైక్ టైసన్ యాక్టింగ్ టైమింగ్ పై అంత పట్టలేదు కాబట్టి అనుకోకుండా యాక్షన్ సన్నివేశంలో విజయ్ మొహం పై గట్టిగా పంచ్ ఇచ్చాడట. ఇక అతనికి ఆ దెబ్బ తగలగానే ఆ రోజంతా మైండ్ దిమ్మతిరిగిపోయినట్లుగా అనిపించిందట.

ఇక తర్వాత మైక్ టైసన్ మల్లి పొరపాటు చేయకుండా విజయ్ తో ఆ షాట్ ను కంప్లీట్ చేశాడట. ఇక చివరి క్లైమాక్స్ లో వచ్చే ఆ సన్నివేశం చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని రమ్యకృష్ణ కూడా ఆ సన్నివేశంలో హైలెట్గా అనిపిస్తుంది అని అంటున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.