Begin typing your search above and press return to search.

ఆ మూవీ చూస్తానన్న మైక్ టైసన్..

By:  Tupaki Desk   |   2 Feb 2016 11:30 AM GMT
ఆ మూవీ చూస్తానన్న మైక్ టైసన్..
X
మైక్ టైసన్ ని బాక్సింగి హిస్టరీలో లెజెండ్ గా మైక్ టైసన్ పేరు ఎప్పటికీ నిలిచిపోయేంతగా ప్రఖ్యాతి చెందాడు. ముందు కూడా చాలా మంది బాక్సింగ్ వీరులు ఉన్నా.. టైసన్ అంతగా గుర్తింపు పొందలేదన్నది వాస్తవం. మరి ఆ యోధుడు ఓ ఇండియన్ సినిమా చూస్తానని చెప్పడం ఖచ్చితంగా చెప్పుకోతగ్గ విషయమే. 'నేను బాక్సింగ్ సినిమా చూడాలని అనుకుంటున్నా' అంటూ టైసన్ తన అఫీషియల్ సైట్లో ట్వీట్ చేశాడు.

ఇది తెలుగు మహిళ సుధ కొంగర తమిళ - హిందీ భాషల్లో తెరకెక్కించిన ఇరుదు సూత్రుపై చేసిన ట్వీట్. టైసన్ చేసిన ఈ ఒక్క ట్వీట్ తో.. ఈ మూవీకి క్రేజ్ రెట్టింపైందని చెప్పాలి. బాక్సింగ్ బేస్డ్ స్టోరీతో తెరకెక్కిన ఈ మూవీకి ఇప్పటికే చాలామంది నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు అత్యుత్తమ బాక్సర్ నుంచి కూడా ఇలాంటి కామెంట్ రావడంతో.. దర్శకురాలు సుధ కొంగర ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అసలు ఈ మూవీలో కోచ్ కేరక్టర్ ని టైసన్ ని స్ఫూర్తిగా తీసుకునే డిజైన్ చేసినట్లు చెప్పుకొచ్చారామె. టైసన్ కి కోచ్ మరణించిన సమయంలో.. ఆయన చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు సుధ కొంగర.

'నేను కోచ్ మాటలు విన్నరోజున ఖచ్చితంగా గెలుస్తాను, పెడచెవిన పెట్టిన రోజు ఓడిపోయాను.' అని మైక్ టైసన్ ఓ మారు చెప్పాడు. ఇప్పుడు తమ మూవీ ఇరుదు సూత్రు కూడా ఇదే థీమ్ తో ఉంటుందని, కోచ్ అంటే ప్లేయర్ కి దేవుడితో సమానమని అంటున్నారు సుధ కొంగర. ఇప్పటికే చాలా సంచలనాలకు వేదికైన ఈ మూవీ.. ఇంకా బోలెడు రికార్డులు సృష్టించే అవకాశాలున్నాయని బాలీవుడ్ అంటోంది.