Begin typing your search above and press return to search.
హీరోయిన్ పేరులో సెక్స్ ఉందని..
By: Tupaki Desk | 6 Sep 2016 4:25 AM GMTఒక్కోసారి అంతే.. అన్నీ కలిసొచ్చినా కూడా ఇలాంటి సెంటిమెంట్ల కారణంగా సినిమాలకు దెబ్బపడుతుంది. జూలై 29న ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విడుదలైన హాలీవుడ్ సినిమా ''బ్యాడ్ మామ్స్'' బాగానే ఆడుతోంది. ఈ సినిమాలో పిల్లలకు తల్లిగా నటించిన హీరోయిన్ మిలా క్యూనిస్ తన కామెడీతో ఆకట్టుకుంది. గతంలో ఆస్కార్ నామినేటెడ్ ''బ్లాక్ స్వాన్'' వంటి సినిమాల్లో అలరించిన ఈ హీరోయిన్.. ఈ సినిమాతో ఇప్పుడు రష్యా దేశంలో పెద్ద చిక్కులే ఎదుర్కొంటోంది.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పోస్టర్లను వేసినప్పుడు.. ''డూ యు వాంట్ సమ్ క్యూనిస్?'' అనే స్లోగన్ తో సినిమాను దించారు. అయితే ఇదే పోస్టర్లను ఇప్పుడు రష్యాలో బ్యాన్ చేశారు. అక్కడి యాడ్ ఏజెన్సీ ఈ పోస్టర్లను వేయలేం అని చెప్పేసింది. రష్యన్ బాషలో క్యూనిస్ అంటే 'ఓరల్ సెక్స్' అనే అర్ధం వస్తుంది. అందుకే ఈ సినిమా క్యాప్షన్ చదివిన రష్యన్లు.. తప్పుగా అర్ధంచేసుకునే ఛాన్సుందట. పైగా రష్యా ఒక క్యాథలిక్ కన్జర్వేటివ్ దేశం కాబట్టి.. ఇలాంటి వేయకూడదట. అందుకే ఇప్పుడు సినిమాకు ప్రమోషన్లు కరువైపోయాయ్.
పాపం ఇప్పుడు రష్యన్ బాషలో బూతు అర్ధం ఉందని.. 33 ఏళ్ళ మిలా క్యూనిస్ తన పేరును మార్చుకోలేదు కదా. అందుకే హీరోయిన్ పేరులో సెక్స్ ఉందని.. ఆ పేరుని తీసేసి పోస్టర్లను వేయడం కష్టమని ఫీలయ్యారట. పైగా అక్కడి ఛానల్స్ కూడా.. ఈ సినిమా ట్రైలర్లో సెక్సువల్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ కామెడీ చేస్తున్నాయి. అది సంగతి.