Begin typing your search above and press return to search.

51 ఏళ్ల నటుడు.. 18 ఏళ్ల యువతితో..

By:  Tupaki Desk   |   13 Oct 2017 4:58 PM GMT
51 ఏళ్ల నటుడు.. 18 ఏళ్ల యువతితో..
X
సాధారణంగా తారల మధ్య ప్రేమలు చిగురించడం కామన్. కానీ అందులో చాలావరకు ఆ ప్రేమలు మధ్యలోనే ఆగిపోతాయి. వయసుతో సంబంధం లేకుండా వారు చేసుకునే పెళ్లిళ్లు కూడా కొన్నాళ్లకే పెటాకులవుతుంటాయి కూడా. కానీ ఏ మాత్రం నిరాశ చెందకుండా స్టార్స్ మరొకరిని ఈజీగా వెతుకుంటారు. అదే తరహాలో ఒక బాలీవుడ్ నటుడు కూడా ఒక యువతిని సెలెక్ట్ చేసుకొని ఆమెతో డేటింగ్ చేస్తున్నాడు.

బాలీవుడ్ నటుడిగానే కాకుండా మోడలింగ్ ప్రపంచంలోనూ బాగా పాపులర్ అయిన మిలింద్‌ సోమన్‌ ప్రస్తుతం ఒక యువతితో డేటింగ్ చేస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఆమెతో కలిసి తీరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. చూసిన వారు కూతురా ? ప్రేముకులారా ? అలా తీరుగుతున్నావ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే మిలింద్ వయసు ఇప్పుడు 51 ఏళ్లు. ఇక మిలింద్‌ డేటింగ్‌ చేస్తున్న యువతి అంకితకు మాత్రం 18 ఏళ్లే. తన వయసులో సగం కూడా లేని అమ్మాయితో మిలింద్ డేటింగ్ చేస్తుండడంతో అలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాని ఆ కపుల్ కు లేని ఏజ్ గ్యాప్ ఇబ్బంది జనాలకు ఎందుకో అనేవారు ఉన్నారు.

మిలింద్ ఎన్నో బాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేశాడు. 2006 లో మైలీన్‌ అనే యువతిని వివాహమాడిన అతను 2009 లోనే విడాకులను ఇచ్చేశాడు. ఆ తర్వాత అంకితతో పరిచయం పెంచుకున్న మిలింద్ డేటింగ్ వరకు వచ్చాడు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఇంగ్లీష్ - తమిళ్ చిత్రాల్లో కూడా మిలింద్ నటించాడు. కార్తీ - ఆవారా సినిమాలో మరియు రాజశేఖర్ - సత్యమేవ జయతే సినిమాల్లో విలన్ గా కనిపించాడు. ఈ మధ్యనే హిందీలో బాజీరావ్ మస్తానీలో.. అలాగే సైఫ్‌ ఆలీ ఖాన్ చెఫ్‌ సినిమాలో కూడా మెరిశాడు.