Begin typing your search above and press return to search.

చీరను అల్ట్రామోడర్న్ చేస్తున్న మాజీ మోడల్

By:  Tupaki Desk   |   1 July 2016 3:30 PM GMT
చీరను అల్ట్రామోడర్న్ చేస్తున్న మాజీ మోడల్
X
భారతీయ సంప్రదాయ వస్త్రమైన చీరను ఆధునిక డ్రెస్ గా మార్చడానికి మాజీ మోడల్ - నటుడు మిళింద్ సోమన్ పెద్ద కసరత్తే చేస్తున్నారు. చీరకట్టు ఎంత అందంగా ఉన్నా... ఎంత హుందాగా ఉన్నా కూడా అంత సౌకర్యవంతమైన డ్రెస్ కాదన్నది మాత్రం వాస్తవం. అలాంటి చీరను సౌకర్యవంతమైన డ్రెస్ గా మార్చాలని మిలింద్ అంటున్నారు. అందుకోసం ఆయన చాలాకాలంగా కృషి చేస్తున్నారు. సాధారణ చీరల కంటే తేలిగ్గా, చిన్న ఉండేలా కొత్తరకం చీరను సృష్టిస్తున్నారు. ఆ చీర కట్టుకుని యోగా చేయొచ్చని.. పరుగు పందెంలో కూడా పాల్గొన వచ్చని చెబుతున్నారు.

కాగా ఒకప్పుడు ఇండియాలో సూపర్ మోడల్ గా ఉన్న మిళింద్ ఆ తరువాత నటుడిగానూ మంచి పేరు తెచ్చుకున్నా చాలా తక్కువగానే సినిమాలు చేశారు. ప్రస్తుతం 51 ఏళ్లు దాటినా కూడా ఇంకా ఫిట్ నెస్ - మారథాన్ వంటి అంశాలకు మంచి ప్రాధాన్యమిస్తూ తనకు నచ్చినట్లుగా తాను జీవిస్తున్నారు. అంతేకాదు... సమాజం కోసం ఏమైనా చేయాలన్న తపనతో ఆయన సామాజిక కార్యక్రమాల్లోనూ విస్తృతంగా పాల్గొంటుంటారు. పింకంథ్లాన్ పేరుతో ఆయన మహిళల కోసమే ప్రత్యేకంగా నిర్వహించే మారథాన్ పోటీల నాలుగో ఎడిషన్ ఈ సెప్టెంబరులో ఉండడంతో ఆ ఏర్పాట్లో ఉన్నారు. మారథాన్ పోటీల్లోనూ చీరలు కట్టుకుని పరుగులు పెట్టేలా చీరల డిజైన్లు మార్చినట్లుగా చెబుతున్నారు.

మహిళా సాధికారత - మహిళల రక్షణ వంటి విషయాల్లో కృషి చేస్తున్న మిళింద్ ఇలా చీరను మోడర్నైజ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సంప్రదాయ చీరకట్టును మార్చడం కరెక్టు కాదని కొందరు వాదిస్తున్నా... ఆధునిక వస్ర్రధారణల కారణంగా ప్రాభవం కోల్పోతున్న చీర మనుగడకు ఢోకా లేకుండా మోడర్నైజ్ చేయడం అవసరమన్న అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళాలోకానికి సౌకర్యవంతంగా ఉండేలా చీర మారితే వారు ఇంకే వస్త్రధారణను కోరుకోరని.. సౌకర్యవంతంగా ఉంటే చీరలనే ధరించడానికి ఇష్టపడతారని అంటున్నారు.