Begin typing your search above and press return to search.
ఔను...వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!
By: Tupaki Desk | 22 April 2018 12:28 PM GMTఆరు పదుల వయసులో ఉన్న ఓ పెద్దాయన......ఇరవయ్యేళ్ల వయసున్న ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు.....అదే తరహాలో 50 ఏళ్ల వయసున్న ఓ మహిళ....పాతికేళ్ల యువకుడితో ప్రేమలో పడుతుంది....సమాజాన్ని ఎదురించి మరీ ఆ జంటలు తమ ప్రేమను ధైర్యంగా వ్యక్తపరుస్తాయి....అలా ఆ కథ సుఖాంతం అవుతుంది.....దాదాపు 30 ఏళ్ల క్రితం టాలీవుడ్ లో సంచలనం రేపిన ఓ సినిమా కథాంశం ఇది. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన చీనీకమ్ సినిమా కూడా దాదాపు ఇదే కథాంశం. నిజ జీవితంలో నుంచే కథలు పుడతాయో....నిజ జీవితాన్ని కథలు ఇన్ స్పైర్ చేస్తాయో తెలియదు కానీ....బాలీవుడ్ లో ఎప్పటినుంచో ఒకటవుదామనుకుంటున్న మిలింద్ సోమన్ - అంకిత కోన్వర్ లు నేడు సినిమా కథను తలపించే రీతిలో ఒక్కటయ్యారు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, భారత మాజీ సూపర్ మోడల్ మిలింద్ సోమన్ (52), అంకిత కోన్వర్(23) లు కొంతకాలంగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. తన వయసులో సగమున్న అంకితను మిలింద్ ప్రేమించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. కూతురి వయసున్న అమ్మాయితో ప్రేమ, పెళ్లి ఏమిటని చాలామంది బహిరంగంగానే విమర్శించారు. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలను మిలింద్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసేవాడు. దీంతో, ఈ జంటపై చర్చోపచర్చలు జరిగేవి. అంకిత నీ ప్రేయసా...లేక కూతురా..? అని నెటిజన్లు ప్రశ్నించేవారు. ఏదో సరదాగా తిరిగి...బ్రేక్ అప్ చెప్పుకుంటారు...అని కొందరు కామెంట్ చేసేవారు. ఆ విమర్శలకు చెక్ పెడుతూ మిలింద్, అంకితలు ఆదివారం నాడు ఒక్కటయ్యారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ....ఈ జంటి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ముంబైలోని అలిబౌగ్ లో బంధుమిత్రుల సమక్షంలో మిలింద్ - అంకిత ల వివాహం సంప్రదాయ పద్ధతిలో జరిగింది. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిని ఈ వివాహ వేడుక ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.