Begin typing your search above and press return to search.

నీ వయసున్న అమ్మాయిలు నచ్చరా?

By:  Tupaki Desk   |   7 Nov 2017 10:05 AM GMT
నీ వయసున్న అమ్మాయిలు నచ్చరా?
X
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఫొటో షేర్ చేయాలంటే ఎలాంటి కామెంట్స్ కనిపిస్తాయో అని సెలబ్రెటీలు తెగ భయపడిపోతున్నారు. ఎలాంటి ఫొటో షేర్ చేసినా కూడా అది కాంట్రవర్సీ అవుతోంది. అందుకే తారలు ఆలోచించి పోస్ట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా ఒక మోడల్ నటుడు పోస్ట్ చేస్తోన్న ఫొటోలకి తీవ్ర స్థాయిలో నెగిటివ్ కామెంట్స్ అందుతున్నాయి. అయినా కూడా అతను ఏ మాత్రం పట్టించుకోకుండా అదే పనిగా పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

అతను ఎవరో కాదు బాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మిలింద్‌ సోమన్‌. ఈయనకి ప్రస్తుతం 52 ఏళ్లు. 2006 లో ఫ్రెంచ్ యాక్టర్ ని పెళ్లి చేసుకొని మూడేళ్లకే విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత మరో 18 ఏళ్ల అమ్మాయితో స్నేహం పెంచుకొని ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నాడు. ఆమె పేరు అంకిత. అయితే ఇద్దరికి దాదాపు 30 ఏళ్ల వయసు తేడా ఉండడంతో నెటిజన్స్ కొన్ని నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఈ వయసులో డేటింగ్ ఏంటి మరి అర్ధం లేకుండా కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో ప్రేమాయణమా? అని కొన్ని రోజుల క్రితం మిలింద్ పోస్ట్ చేసిన ఫొటోలకి కామెంట్స్ వచ్చాయి. అయితే రీసెంట్ గా నవంబర్ 4న గర్ల్ ఫ్రెండ్ తో మిలింద్ తన 52వ పుట్టిన రోజును జరుపుకొన్నాడు. ప్రస్తుతం నార్వేలో విహారయాత్రలను కూడా చేస్తున్నాడు.

ఈ జర్నీకి సంబందించిన ఫోటోలని మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ సారి నెటిజన్స్ డోస్ కాస్త పెంచారు. నరేంద్ర మోడీ బేటీ పఢావో - బేటీకో మిలింద్‌ సోమన్‌ సే బచావో పథకాన్ని వెంటనే ప్రారంభించాలని ఒకరంటే.. మరొకరు మిలింద్‌ ఇప్పుడే కాదు ఇంతకుముందు 20 ఏళ్ల అమ్మాయితో కూడా డేటింగ్‌ చేశాడు.. అతనికి తన వయస్సు తో సమానంగా ఉన్న మహిళలు ఎందుకు నచ్చరో అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తున్నారు. కానీ నటుడు మాత్రం ఆ కామెంట్స్ ని అస్సలు పట్టించుకోవడం లేదు. కానీ ఒక్కరు మాత్రం అతనికి సపోర్ట్ చేశారు. మిలింద్ 50లోకి అడుగుపెట్టినా కూడా హాట్ గా ఉన్నాడని ప్రముఖ రచయిత భావన అరోరా ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఇక నుండి ట్రోల్స్ చేయకండని కూడా ఆమె కోరారు.