Begin typing your search above and press return to search.

గ్యాప్ దొరికితే ఉల్టా పల్టా పోజు!

By:  Tupaki Desk   |   16 May 2019 4:52 AM GMT
గ్యాప్ దొరికితే ఉల్టా పల్టా పోజు!
X
మోడల్..మోడలింగ్ అనే పదం వాడినప్పుడు సహజంగా అమ్మాయిలకు సంబంధించి మాట్లాడుతున్నారేమో అని మన తెలుగువాళ్ళు జనరల్ గా అనుకుంటారు. కానీ మేల్ మోడల్స్ కూడా ఉంటారు. వారిలో సూపర్ మోడల్స్ కూడా ఉంటారు. అయితే ఈ రంగంలో ముప్ఫై ఏళ్ళ క్రితమే ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించిన సూపర్ మోడల్ మిలింద్ సోమన్. బాలీవుడ్ లో కూడా చాలా సినిమాల్లో నటించాడు. తెలుగులో కూడా ఒకటి అరా సినిమాలో కనిపించాడు. ఇప్పుడు ఆయన వయసు 53.

అయితే ఫిట్నెస్ లెవెల్స్ మాత్రం జస్ట్ 23 అనుకోవాలి. మారథాన్ రన్నర్. ఇండియాలో ఎక్కడ మారథాన్ జరిగితే అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అంతే కాదు యోగా స్పెషలిస్ట్. హెయిర్ కు కలర్ మాత్రం వేసుకోడు. అదే కలర్ వేసుకున్నాడంటే వయసు ముప్ఫైకంటే ఎక్కువ ఉంటుందని ఎవరూ అనుకోరు. స్వతహాగా మోడల్ కాబట్టి హాలీవుడ్ హీరోల స్టైల్ లో ఉండడం ఈ మిలింద్ కు వెన్నతో పెట్టిన విద్య. ఫిట్నెస్ విషయంలో ఎవరూ మిలింద్ తో పోటీ పడలేరు. అందుకే ఆయన ఇన్స్టా ఖాతాలో పరిగెడుతూ ఉన్న ఫోటోలే ఎక్కువ. మరో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయనకు మూడ్ వస్తే చాలు శీర్షాసనం వేస్తాడు!

బీచ్ కానివ్వండి.. బ్రిడ్జ్ ముందు కానివ్వండి.. కొండపై ఉన్న కోట కానివ్వండి.. పచ్చని చెట్లు నేపథ్యంలో ఉన్న లొకేషన్ కానివ్వండి.. తల కిందకు పెట్టి కాళ్ళు పైకెత్తుతాడు. ఆ ఫోటోను తన ఇన్స్టాలో పోస్ట్ చేస్తాడు. రామ్ దేవ్ బాబా గారు యోగాకు సన్యాసుల.. స్వామీజిల వెర్షన్ అయిన ఈ మిలింద్ సంసారుల వెర్షన్. జస్ట్ ఫోటోలు చూసి ఎంజాయ్ చేయండి. ఏదో ఆయన ప్రయత్నించాడు కదా అని ఇన్ స్పైర్ అయ్యి ఆయాసపడితే కుయ్యి కుయ్యిమని 108 వచ్చెయ్యగలదు. ఇవన్నీ సింపుల్ గా కనపడే యమా డేంజరస్ స్టంట్లు. భారీ ప్రాక్టీస్ ఉంటేనే సాధ్యం!