Begin typing your search above and press return to search.

బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చి అల్లుడిలా చూసుకున్నారు!

By:  Tupaki Desk   |   5 Nov 2019 12:39 PM GMT
బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చి అల్లుడిలా చూసుకున్నారు!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమాలో కీల‌క స‌న్నివేశాల్ని జ‌మ్ము క‌శ్మీర్ లో తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌కు ముంద‌స్తు అనుమ‌తులు తీసుకోవాల్సి వ‌చ్చింది. అందుకు ప్ర‌త్యేకించి కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సాయం తీసుకున్నార‌ట అనీల్ సుంక‌ర‌-మ‌హేష్ బృందం. మ‌హేష్ కి ప్ర‌త్యేకించి బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీని ఇచ్చార‌ని ఇంత‌కుముందు చెప్పుకున్నాం.

అదంతా అటుంచితే క‌శ్మీర్ షూట్ లో మ‌రిన్ని ప్ర‌త్యేక కండీష‌న్ల గురించి తాజాగా రివీలైంది. వాస్త‌వానికి అక్క‌డ కాల్షీట్ అంటే 9 ఏఎం నుంచి సాయంత్రం 6 పీఎం కానేకాదు. వేకువ‌ఝామును 5గంట‌ల నుంచి 10 గంట‌ల లోపు మాత్ర‌మే షూటింగుల‌కు అనుమ‌తించార‌ట‌. అలాగే మ‌హేష్ సెట్స్ కెళ్లేప్పుడు ప్ర‌త్యేకించి త‌న కోసం ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ ని ఇచ్చి పంపేవార‌ట‌. అలా జమ్మూకాశ్మీర్ లో ఆగష్టు 4 వ తేదీకే షూటింగ్ పూర్తి చేసారు. అనంత‌రం యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఆ మ‌రుస‌టి రోజు నుంచే.. అంటే ఆగష్టు 5 వ తేదీన అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు ఆంక్షలు విధించారు.

దీనిని బ‌ట్టి ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అవుతోంద‌న్న టెన్ష‌న్ జ‌మ్ము క‌శ్మీర్ ప‌రిస‌రాల్లో అప్ప‌టికే ఉంది. స‌రిలేరు టీమ్ ఎన్నో ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంద‌ని అర్థ‌మ‌వుతోంది. కేంద్ర మంత్రి సాయం అంద‌క‌పోయి ఉంటే మ‌రి ఏమ‌య్యేదో? నిరంత‌రం ఎంతో సెన్సిటివ్ గా ఉండే చోట షూటింగులు అంటే ఎంతో రిస్క్ ఉంటుంది. నిరంత‌రం ఆర్మీ గ‌స్తీ మ‌ధ్య ఎంతో బెరుకుగానే షూటింగులు చేయాల్సి ఉంటుంది. అయితే మ‌హేష్ కి ఖ‌రీదైన బుల్లెట్ ప్రూఫ్ కార్ ని ఏర్పాటు చేసి అల్లుడిలానే ట్రీట్ చేశార‌ని అనుకోవ‌చ్చు