Begin typing your search above and press return to search.

క‌బాలి కోసం 50 వేల లీట‌ర్ల పాలా?

By:  Tupaki Desk   |   18 July 2016 3:45 PM GMT
క‌బాలి కోసం 50 వేల లీట‌ర్ల పాలా?
X
హీరో క‌టౌట్ కు పాలాభిషేకాలు చేయ‌డం అనే కాన్సెప్ట్ మొద‌లైంది ర‌జినీ కాంత్ సినిమాల‌తోనే. అభిమానుల్లో ఏదో స‌ర‌దాగా మొద‌లైన ఆ అల‌వాటు ఇప్పుడు మ‌రీ పైత్యంగా మారిపోయింది. ర‌జినీ సినిమా వ‌స్తోందంటే చాలు.. వేల‌కు వేల లీట‌ర్ల పాలు వృథా అయిపోతోంది. ఓ ప‌క్క కొంద‌రు అభాగ్యులు ఆక‌లితో అల్లాడుతుంటే.. ఇంకో ప‌క్క ఇలా లక్ష‌ల రూపాయ‌ల విలువ చేసే పాలు వృథాగా నేల‌లో క‌లిసిపోతోంది.

ర‌జినీ కొత్త సినిమా క‌బాలి విష‌యానికి వ‌స్తే.. ఈ సినిమా విడుద‌ల రోజు క‌టౌట్ల‌కు అభిషేకం చేయ‌డానికి రూ.20 ల‌క్ష‌ల విలువ చేసే 50 వేల లీట‌ర్ల పాలు వృథా కాబోతున్న‌ట్లు త‌మిళ‌నాడు పాల వ్యాపారుల సంఘం అంచ‌నా వేసింది. తమిళనాడులో 15శాతం మంది రోజూ పాలుకొనేందుకు డబ్బుల్లేక ఇబ్బంది ప‌డుతున్నార‌ని.. ఇలాంటి ప‌రిస్థితుల్లో పాలు ఇలా వృథా చేయడం సబబా అని ఆ సంఘం ప్ర‌శ్నించింది. ఎన్నో మంచి కార్య‌క్ర‌మాలు చేసే ర‌జినీ అభిమానులు ఈ దురాచారం మానుకోవాలంటూ క‌బాలి విడుద‌ల ముందు ఆ సంఘం ఓ ప్ర‌క‌ట‌న ఇచ్చింది.

అన్నామ‌లై సినిమాలో ర‌జినీ పాల‌వాడిగా న‌టించిన‌ప్ప‌ట్నుంచి అభిమానులు ఆయ‌న క‌టౌట్ కు పాలాభిషేకాలు చేయ‌డం మొద‌లుపెట్టారు. ఒక‌ట్రెండు చోట్ల ఈ ప‌ద్ధ‌తి మొద‌లై.. త‌ర్వాత అన్ని ప్రాంతాల‌కూ విస్త‌రించింది. మిగ‌తా హీరోల అభిమానులు కూడా ఈ దుస్పంప్ర‌దాయాన్ని అల‌వాటు చేసుకున్నారు. స్వ‌యంగా ర‌జినీనే త‌న అభిమానుల‌కు ఈ విష‌యంలో ఓ పిలుపు ఇస్తే బెట‌రేమో.