Begin typing your search above and press return to search.

కథలు అల్లే వారికి కౌంటర్.. భర్తను పరిచయం చేసిన మిల్కీ బ్యూటీ

By:  Tupaki Desk   |   17 Nov 2022 4:13 AM GMT
కథలు అల్లే వారికి కౌంటర్.. భర్తను పరిచయం చేసిన మిల్కీ బ్యూటీ
X
ఇదిగో తోక అంటే.. అదిగో పులి అనే పరిస్థితి నుంచి.. తోక లేకున్నా.. అలాంటిది ఒకటి ఉందని పేర్కొంటూ.. అదే పులి అంటూ ప్రచారం చేసే సోషల్ మీడియా రోజులు ఇప్పుడు నడుస్తున్నాయి. అనుక్షణం ఏదో ఒక కొత్తదనం కోసం ఆరాటం.. దాని కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.

ఇలాంటి వేళ.. ఎదురవుతున్న ఏకైక ఇబ్బంది నిజం ఏమిటి? అన్నదే. సామాన్యుల విషయాన్ని కాస్త పక్కన పెడితే.. సెలబ్రిటీలు.. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబందించి వస్తున్న తప్పుడు కథనాలు.. మనసుకు తోచిన ఆలోచనను ఒక సిస్టమాటిక్ గా కథను అల్లేసి జనాల మీదకు వదిలేస్తున్న తీరు అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

మిల్కీ బ్యూటీగా సుపరిచితురాలు.. సుదీర్ఘకాలంగా సినిమాల్లో నటిస్తూ.. ఇప్పటికిప్పుడు నాలుగైదు ప్రాజెక్టులు చేస్తూ తన ఛరిష్మా ఎంతన్న విషయాన్ని చేతల్లో చేసి చూపిస్తున్న తమన్నాకు పెళ్లి చేసేయాలన్న కోరికను బాగా పెట్టేసుకున్నారు కొంతమంది సోషల్ మీడియా బ్యాచ్. వీరిపుణ్యమా అని.. అసలు లేని పెళ్లిని ఇప్పుడు హాట్ టాపిక్ గా మార్చటమే కాదు.. దానికి సంబంధించిన కథనాలతో ఉదరగొట్టేస్తున్నారు.

తాజాగా ఆమెకు పెళ్లి సంబంధం ఒకటి ఫిక్స్ అయ్యిందని.. త్వరలోనే పెళ్లి పీటల మీదకు తమన్నా ఎక్కనుందన్న విసయంతో పాటు.. సదరు పెళ్లి కొడుకు వివరాల్ని వెల్లడిస్తూ కొన్ని కథనాలు వచ్చేశాయి. ఇలాంటివేళ.. తన పెళ్లి మీద జరుగుతున్న రచ్చకు తనదైన రీతిలో రియాక్టు అయ్యింది తమన్నా. తన పెళ్లి మీద జరుగుతున్న ప్రచారంలో ఇసుమంత కూడా నిజం లేని వేళ.. 'మ్యారేజ్ రూమర్స్' పేరుతో హ్యాష్ టాగ్ పెట్టి మరీ.. పెళ్లి కొడుకు ఇతడే అంటూ ఒక ఫోటో పోస్టు పెట్టి కామెడీ చేసింది.న

ఇంతకూ ఆ పెళ్లి కొడుకు ఎవరో కాదు.. తమన్నా తన రీసెంట్ మూవీ ఎఫ్3లో నటించిన మేల్ గెటప్ కు చెందిన ఫోటోను పోస్టు చేసి.. తన పెళ్లిపై కథలు అల్లిన వారికి దిమ్మ తిరిగే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసింది. ఎఫ్3 మూవీలో తమన్నా మగాడి మాదిరి నటించిన సంగతి తెలిసిందే. ఇదే ఫోటోను షేర్ చేసిన ఆమె.. ఇతనే నా భర్త (వ్యాపారవేత్త)' అంటూ పిక్ మీద రాసిన తీరు చూస్తే.. ఆమె పెళ్లి మీద జరిగిన ప్రచారంలో ఇసుమంత కూడా నిజం లేదన్న విషయాన్ని తేల్చేసిందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.