Begin typing your search above and press return to search.

మిల్కీ బ్యూటీ న‌యా డిజైన‌ర్ లుక్ వ్వావ్వా

By:  Tupaki Desk   |   15 Aug 2021 4:30 PM GMT
మిల్కీ బ్యూటీ న‌యా డిజైన‌ర్ లుక్ వ్వావ్వా
X
మాస్ట‌ర్ చెఫ్ అనే బుల్లితెర షోతో త‌మ‌న్నా స‌రికొత్త ప్ర‌యత్నం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఈ షోతో మిల్కీ బ్యూటీకి మ‌రింత‌గా ఇమేజ్ పెర‌గ‌నుంది. ఇక‌పోతే త‌మ‌న్నా ఇటీవ‌ల బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నితిన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న మాస్ట్రో చిత్రంలో త‌మ‌న్నా విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది.

మ‌రోవైపు మిల్కీ బ్యూటీ సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌తో హీట్ పెంచుతోంది. ఇటీవ‌ల హాటెస్ట్ ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా బ్లాక్ క్రిస్ట‌లైన్ మిర్ర‌ర్ వ‌ర్క్ లెహంగాలో ఎంతో అందంగా క‌నిపిస్తున్న ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది. టూ గ్లామ్ టు గివ్ ఏ డామ్న్! అంటూ క్యాప్ష‌న్ ని ఇచ్చింది.

బ్లాక్ అండ్ బ్లాక్ లో మిర్ర‌ర్ వ‌ర్క్ తో ఈ డిజైనర్ లుక్ మిల్కీకి అద్భుతంగా సెట్ట‌య్యింది. త‌న హెయిర్ డిజైన్ అంతే యాప్ట్ గా ఆక‌ర్షించింది. ఇక ఆ ఎల్లో వాల్ పై త‌మ‌న్నా నీడ ఫోక‌స్ అవుతోంది. ఓవ‌రాల్ గా ఈ లుక్ కి అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌స్తోంది. ఇక ఇటీవ‌లి కాలంలో త‌మ‌న్నా త‌న‌లోని గ్లామ్ యాంగిల్ ని దాచుకునేందుకు ఏమాత్రం ఆస‌క్తిగా లేదు. అందాల ఆర‌బోత‌కు అడ్డు చెప్ప‌డం లేదు. నేటిత‌రానికి ధీటుగా పోటీప‌డేందుకు అవ‌స‌ర‌మైన అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది.