Begin typing your search above and press return to search.

మిల్కీని ఇంత‌కుముందెప్పుడూ ఇలా చూసి ఉండ‌రు!

By:  Tupaki Desk   |   2 Aug 2022 6:31 AM GMT
మిల్కీని ఇంత‌కుముందెప్పుడూ ఇలా చూసి ఉండ‌రు!
X
ఫ్యాష‌న్ అండ్ ట్రెండ్స్ లో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నాన్ని వైవిధ్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తేనే ఇక్క‌డ వ‌ర్క‌వుట‌వుతుంది. రంగుల ప్ర‌పంచంలో నిరంత‌రం ఏదో ఒక కొత్త‌ద‌నంతో అందాల భామ‌లు హాట్ టాపిక్ గా మారుతున్నారు. మీడియా అటెన్ష‌న్ ని గ్రాబ్ చేయ‌డం కోసం ఎలాంటి ప్రయోగాల‌కైనా వెన‌కాడ‌డం లేదు. నేటిత‌రం ఇందులో చాలా స్పీడ్ మీద ఉంది. అయితే ఇలాంటి పోటీని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే సీనియ‌ర్లు ఏం చేయాలి? అంటే ఇదిగో ఇక్క‌డ త‌మ‌న్నాను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

తమన్నా భాటియా తాజా ఎయిర్ పోర్ట్ లుక్ సంచ‌ల‌నంగా మారింది. ముంబయి ఎయిర్ పోర్ట్ లో త‌మ‌న్నా మెరుపులు ఇప్పుడు కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పెడుతున్నాయి. సింపుల్ గా క‌నిపిస్తూనే సంథింగ్ హాట్ గా క‌నిపించ‌డ‌మెలానో ఈ డిజైన‌ర్ లుక్ లో క‌నిపిస్తోంద‌న్న ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

బాహుబ‌లి అవంతిక ఉన్న‌ట్టుండి ఇలా ప్ర‌త్య‌క్ష‌మైంది.. మునుపెన్న‌డూ ఇలాంటి ట్రీట్ లేనే లేదు! అంటూ అభిమానులు ఈ ఫోటోల‌ను వైర‌ల్ గా షేర్ చేస్తున్నారు. మిల్కీ రెడ్ హాట్ ష‌ర్ట్ ధ‌రించి ట్రెండీగా క‌నిపించింది. ఇక ఆ రెడ్ ష‌ర్ట్ పై లేడీ ఫోజ్ ప్రింటింగ్ ఆప్ష‌న్ ఎంతో వైబ్రేంట్ గా ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తోంది. కాంబినేష‌న్ గా బ్లూ డెనిమ్స్ లో త‌మ‌న్నా ట్రెండీ ఫ్యాష‌నిస్టాని త‌ల‌పించింద‌ని ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఇది నెవ్వ‌ర్ బిఫోర్ స్టైల్ అంటూ యూత్ పొగిడేస్తున్నారు.

తమన్నా సోష‌ల్ మీడియాల్లో అత్యంత పాపులారిటీ ఉన్న‌ నటీమణులలో ఒకరు. ఇక ట్రెండ్స్ ని అనుస‌రించ‌డంలోను..తనదైన‌ స్టైల్ స్టేట్ మెంట్ తో ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ఆస‌క్తిగా ఉంటుంది త‌మ‌న్నా.. అది ఫోటోషూట్ అయినా.. సాధారణ విహారయాత్ర అయినా లేదా బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ అయినా తమన్నా భాటియా ఎప్పుడూ ఈవెంట్లో స్టైల్ గా యూనిక్ గా కనిపిస్తుంది. త‌మ‌న్నా నిన్న రాత్రి ముంబై విమానాశ్రయంలో తన అద్భుతమైన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రింటెడ్ రెడ్ టీ-షర్ట్ డెనిమ్ జీన్స్ లో మెరిపించింది. అంతేకాదు త‌మ‌న్నా విమానాశ్రంలో కెమెరామెన్ ల‌ను చిరునవ్వుతో ప‌ల‌కరించింది. ఫోటోలను తీయడానికి వారిని అనుమతించింది. ఆ తర్వాత త‌న‌మార్గంలో బయటకు వెళ్లింది. అలా వెళ్లేప్పుడు అభిమానులను ఆరాధకులను తనతో సెల్ఫీలు తీసుకోవడానికి అనుమతించింది ప్రతి ఒక్కరితో చాలా మృధువుగా ప్ర‌వ‌ర్తించిన తీరు ఆక‌ట్టుకుంది. త‌మ‌న్నా సౌత్ నార్త్ సినిమాల‌తో బిజీగా ఉంది. అందుకే నిరంత‌రం విమానాశ్ర‌యాల్లో బిజీ ప్ర‌యాణాల‌తో క‌నిపిస్తోంది.

తమన్నా భాటియా ఇటీవ‌లి కెరీర్ ని ప‌రిశీలిస్తే.. బాహుబలి- సైరా నరసింహ రెడ్డి వంటి పాన్ ఇండియా చిత్రాలలో న‌టించి కంబ్యాక్ అయ్యింది. తదుపరి వెంకటేష్- వరుణ్ తేజ్- మెహ్రీన్ పిర్జాదాతో కలిసి F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఇటీవ‌లే విడుదలై విజ‌యం అందుకుంది. త‌దుప‌రి నవాజుద్దీన్ సిద్ధిఖీతో బోలే చుడియాన్ .. రితీష్ దేశ్‌ముఖ్ తో 'ప్లాన్ ఏ ప్లాన్ బి' చిత్రాల్లోనూ న‌టిస్తోంది. త‌మ‌న్నా న‌టించిన ఇత‌ర తెలుగు సినిమాలు విడుద‌ల‌కు రానున్నాయి. బాలీవుడ్ లో మ‌ధుర్ భండార్కర్ తో క‌లిసి ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ డ్రామా 'గుర్తుండ సీతాకాలం' విడుద‌ల కావాల్సి ఉంది. భోలా శంకర్- చోర్ నికల్ కే భాగా - యెన్ ఎండ్రు కాదల్ ఎన్ బెన్ వంటి సినిమాల్లో న‌టిస్తోంది.