Begin typing your search above and press return to search.

ఆహా కోసం మిల్కీబ్యూటీ క్రేజీ ప్రోగ్రాం..!

By:  Tupaki Desk   |   23 April 2021 5:30 PM GMT
ఆహా కోసం మిల్కీబ్యూటీ క్రేజీ ప్రోగ్రాం..!
X
తెలుగు ప్రేక్షకులకు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అవకాశం ఈ మధ్యకాలంలో సరిగ్గా దొరకలేదు. డిసెంబర్ లో థియేటర్స్ ఓపెన్ అయినప్పటికి ఫిబ్రవరిలో థియేటర్లకు 100% అక్యూపెన్సీ లభించింది. కానీ థియేటర్స్ రన్ అవుతూ నెలరోజులు గడవకముందే మళ్లీ కరోనా సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. అంతే థియేటర్స్ మళ్లీ మూతపడటం మొదలైంది. కానీ ఏడాది కాలంగా థియేటర్స్ ఉన్నా లేకున్నా జనాలు మాత్రం సినిమాలు చూడటం ఆపలేదు. ఎందుకంటే అందుబాటులో ఓటిటిలు ఉన్నాయి కాబట్టి. అందులో భాగంగానే తెలుగు ప్రేక్షకులకు కేవలం తెలుగు సినిమాలు ప్రోగ్రాంస్ అందిస్తోంది ఆహా ఓటిటి. అగ్రనిర్మాత అల్లు అరవింద్ పర్యవేక్షణలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

అయితే తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నాతో 'లెవెన్త్ అవర్' అనే వెబ్ సిరీస్ నిర్మించింది. ట్రైలర్ వరకు ఆకట్టుకున్నా వెబ్ సిరీస్ విడుదలయ్యాక మాత్రం ఆకట్టుకోలేకపోయింది. తమన్నాను చూసి అట్రాక్ట్ అయినప్పటికీ లెవెన్త్ అవర్ మాత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేదు. ఇప్పటివరకు ఆహాలో భారీ బడ్జెట్ తో నిర్మించిన వెబ్ సిరీస్ ఇదే కావడం విశేషం. కానీ ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆహా బృందం మాత్రం పాజిటివ్ గానే ముందుకు సాగుతుంది. తమన్నా గ్లామర్ బ్యూటీ కాబట్టి ఆమెతో మరో ఇంటరెస్టింగ్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుందట. అంతేగాక ఎలాగో ఆహాలో టాక్ షోలు కూడా సక్సెస్ అవుతున్నాయి. ఇటీవలే సామ్ జామ్ ప్రోగ్రాం కూడా సక్సెస్ అయింది. చూడాలి మరి మిల్కీబ్యూటీ టాక్ షో వస్తుందేమో. ప్రస్తుతం తమన్నా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.