Begin typing your search above and press return to search.
మిలియన్ వ్యూస్.. లైట్ తీసుకో బాస్
By: Tupaki Desk | 2 Jun 2017 10:54 AM GMTఒక తెలుగు సినిమాను హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో పెడితే 50 లక్షలు.. కోటి వ్యూస్ వస్తాయని ఎప్పుడైనా అనుకున్నామా..? హిట్టు సినిమా అయినా ఒక లెక్క అనుకుందాం.. ఇక్కడ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఇక కొత్త సినిమాల టీజర్లు.. ట్రైలర్లు వచ్చినపుడు వ్యూస్ మోత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. చిన్నా చితకా హీరోల సినిమాల టీజర్లకూ యూట్యూబ్ లో అనూహ్యమైన స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. గంటలో ఇన్ని లక్షల వ్యూస్ అని.. 10 మిలియన్ మార్కు ఇంత వేగంగా టచ్ చేసిందని.. లైక్స్ అన్ని ఇన్నీ వచ్చాయని.. ఇలాంటి వార్తలు ఈ మధ్య బాగా ఎక్కువైపోయాయి.
ఇదంతా గత ఏడాది ‘జియో’ అరంగేట్రంతో వచ్చిన మార్పు. ఫ్రీ ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రతి ఒక్కరూ టీజర్లు.. ట్రైలర్లతో పాటు సినిమాలకు సంబంధించి అన్ని వీడియోల మీదా ఓ లుక్ వేసేస్తున్నారు. దీంతో లక్షల కొద్దీ వ్యూస్ వచ్చేస్తున్నాయి. జియోకు పోటీగా మిగతా నెట్ వర్క్స్ కూడా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించేస్తుండటంతో వ్యూస్ రికార్డులు ఎప్పటికప్పుడు బద్దలైపోతున్నాయి. యూట్యూబ్ లో పనికి రాని వీడియోలకు సైతం మిలియన్ వ్యూస్ వస్తున్నాయి.
ఇలాంటి టైంలో తమ సినిమా టీజర్ ఇంత వేగంగా అన్ని వ్యూస్ తెచ్చుకుంది... ఆ మార్కు అందుకుంది అని జబ్బలు చరుచుకోవడం అవసరమా అన్నది ఇప్పుడు ప్రశ్న. వీటి గురించి ట్వీట్లు చేయడం.. డిస్కషన్లు పెట్టడం.. అభిమానులు సవాళ్లు విసురుకోవడం.. వీటి మీద వార్తలు రావడం.. ఇవన్నీ ఇక చాలిస్తే మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యూట్యూబ్ వ్యూస్ విషయంలో కొన్ని మ్యానుపులేషన్స్ కూడా జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో జనాలకు కూడా ఈ వ్యూస్ విషయంలో ఇంతకుముందున్న ఆసక్తి ఇప్పుడు కనిపించడం లేదు. వాళ్లు కూడా మిలియన్ వ్యూస్.. లక్ష లైక్స్ లాంటి మాటల్ని లైట్ తీసుకుంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/