Begin typing your search above and press return to search.

సోనాల్ దెబ్బ‌కు మైండ్ బ్లాక్ అంతే

By:  Tupaki Desk   |   8 Feb 2022 2:54 AM GMT
సోనాల్ దెబ్బ‌కు మైండ్ బ్లాక్ అంతే
X
అద్దంలో అందాల చుక్క‌.. ఎన్నాళ్ల‌ని త‌న‌ని తానే చూసుకుంటుంది? ఎంత చూసినా అదే రూపం మార‌దుగా.. ఎంత‌గా ఆరాధించినా అదే యూత్ అంతేగా!!

న‌టసింహా బాల‌య్య బాబు స‌ర‌స‌న క్రేజీగా వ‌రుస అవ‌కాశాలు అందుకున్న సోనాల్ చౌహాన్ ఆ త‌ర్వాత పెద్ద స్టార్ డ‌మ్ ని ఆశించింది. కానీ టాలీవుడ్ లో త‌న ప‌ప్పులుడ‌క‌లేదు. అటు బాలీవుడ్ లో ఉన్న ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ని ఎదురీద‌లేక‌పోయింది. ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు క‌నిక‌రించ‌లేదు. ఏది ఏమైనా ఇంకా ద‌ర్శ‌కుల‌కు ఐట‌మ్ భామ‌గానో లేదా సెకండ్ హీరోయిన్ ఛాయిస్ గానే మిగిలిపోయింది.

అయితే సోనాల్ లో ఉన్న విజువ‌ల్ బ్రిలియ‌న్సీ ఇంత పోటీలోనూ త‌న‌కు ఇంకా అవ‌కాశాల్ని తెచ్చి పెడుతోంది. అందాల ఆర‌బోత‌లో హ‌ద్దులు చెరిపేసేందుకు ఈ హాట్ బ్యూటీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందుకే ఇప్ప‌టికీ టాలీవుడ్ అడ‌పాద‌డ‌పా పిలిచి అవ‌కాశాలిస్తోంది. ప్ర‌స్తుతం ఈ భామ ఎఫ్ 3 కంటెంట్ కి ఈ ముంబై బ్యూటీ అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. వెంకీ- వ‌రుణ్ ల‌తో క‌లిసి రొమాన్స్ ని ఏ రేంజులో పండించ‌బోతోందోన‌న్న హోప్ యువ‌త‌రంలో ఉంది.

ఇక అద్దంలో సెల్ఫీలు దిగ‌డం సోనాల్ కి కొత్తేమీ కాదు.. కానీ ఇప్పుడు మ‌రో స‌రికొత్త ఫోటోగ్రాఫ్ తో అంత‌ర్జాలంలో హీట్ పెంచింది. బ్లాక్ టాప్ అదిరెను.. వైట్ ఫ్యాంటు అదిరెను.. ముద్దుగుమ్మ ఇంకా ఎంతో మ‌చ్చ‌ట‌గా ఉంది! అంటూ కుర్రాళ్లు క‌ల‌ల లోకంలో విహ‌రిస్తున్నారు. ఇక ఎఫ్ 3తో మైండ్ బ్లాక్ ట్రీట్ ఇవ్వ‌డ‌మే త‌రువాయి. సోనాల్ కి తెలుగులో మ‌రిన్ని ఆఫ‌ర్లు ద‌క్కుతాయ‌నే భావిస్తున్నారు. ప్ర‌స్తుతానికి ఇలాంటి వేడెక్కించే ఫోటోల‌తో సోష‌ల్ మీడియాల్లో ఫాలోయింగ్ పెంచుకుంటూ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల‌తో బాగానే ఆర్జిస్తోంది.