Begin typing your search above and press return to search.
‘మెగా’ వేడుక.. మినీ మైదానంలోనా?
By: Tupaki Desk | 4 Jan 2017 7:47 AM GMT‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అని పేరు పెట్టి ఈ వేడుకకు ముందు నుంచి చాలా హైప్ ఇస్తున్నారు. బాస్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి అభిమానులంతా ఈ వేడుకకు వచ్చేయాలంటూ రామ్ చరణ్ ఒకటికి రెండుసార్లు పిలుపునిచ్చేశాడు. తొమ్మిదేళ్ల తర్వాత చిరు నటించిన సినిమాకు సంబంధించిన వేడుక కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి వెళ్లాలని మెగా అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.
కానీ ఇంత హైప్ ఉన్న వేడుకకు ఎంచుకున్న మైదానం విషయంలోనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోయే హాయ్ ల్యాండ్ మైదానం చిన్నది. అందులో వేలల్లో మాత్రమే జనాలు పడతారు. కానీ ‘ఖైదీ నెంబర్ 150’ ప్రిరిలీజ్ ఈవెంట్ కు లక్షల్లో అభిమానులు తరలి వస్తారని భావిస్తున్నారు. మరి అంతమందిని స్టేడియంలో ఎలా పట్టిస్తారు.. అదనంగా వచ్చే జనాల్ని ఎలా కంట్రోల్ చేస్తారు అన్నది ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.
గత కొన్నేళ్లలో ఆడియో వేడుకల్లో తొక్కిసలాటలు జరగడం.. కొందరు అభిమానులు ప్రాణాలు కోల్పోవడం చూశాం. ఈ నేపథ్యంలో ఇలాంటి వేడుకలకు మరీ హైప్ ఇవ్వడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా వేడుక చేయాలనుకున్నపుడు అందుకు తగ్గ వేదికను ఎంచుకోవాలి. ఏర్పాట్లు కూడా పక్కాగా ఉండేలా చూసుకోవాలి. ఐతే విజయవాడ ఇందిరా గాంధీ మైదానంలో చేయాలనుకున్న వేడుక అనుకోకుండా హాయ్ ల్యాండ్ కు మారింది. చాలా తక్కువ సమయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ వేడుకకు వచ్చే అశేష అభిమాన గణాన్ని ఎలా కంట్రోల్ చేస్తారో.. ఏ ఇబ్బందీ రాకుండా వేడుకను ఎలా ముగిస్తారో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/