Begin typing your search above and press return to search.
మినీ రివ్యూ : కాంతారా
By: Tupaki Desk | 8 Oct 2022 12:00 PM GMT`కేజీఎఫ్` తో కన్నడ ఇండస్ట్రీ పేరు దేశ వ్యాప్తంగా మారు మోగిన విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచి కన్నడ నుంచి వస్తున్న కొన్ని సినిమాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతూ దేశ వ్యాప్తంగా అటెన్షన్ ని క్రియేట్ చేస్తున్నాయి. కేజీఎఫ్ సిరీస్ సినిమాల తరువాత రక్షిత్ శెట్టి నటించిన `777 ఛార్లీ`, కిచ్చా సుదీప్ నటించిన `విక్రాంత్ రోణ` కన్నడ ఇండస్ట్రీ గురించి చెప్పుకునేలా చేశాయి. అదే కోవలో వచ్చిన `కాంతారా` పేరు కూడా ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. `బెల్ బాటమ్, గరుడ గమన వృషభ వాహన వంటి చిత్రాలతో హీరోగా, రష్మిక మందన్న నటించిన `కిరిక్ పార్టీ` సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఈ మూవీలో హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం వహించాడు. ఈ మూవీని హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ నిర్మించారు.
ఒక కల్పిత గ్రామంలో జరిగే కథ ఇది. బూత కోలని ప్రదర్శించే ఓ వ్యక్తి తనయుడు శివ (రిషబ్ శెట్టి). ఇతనొక కంబలే అథ్లెట్. ఆ గ్రామంలో అతి పెద్ద భూస్వామి అయిన దేవేంద్ర సుత్తోరు (అచ్యుత్ కుమార్) వద్ద సని చేస్తూ వుంటాడు. అయితే శివది దూకుడు స్వభావం. తిరుగుబాటు భావాలుగలవాడు. ఇక గ్రామం అడవికి సమీపంగా వుండటంతో అక్కడి ప్రజలంతా అడవిలో లభించే జంతులని వేటాడటం, కూరగాయలు, పండ్ల కోసం అడవికి వెళ్లడం ఆనవాయితీగా మార్చుకుంటారు. దీంతో అడివి వారి జీవితాల్లో ఓ భాగం అవుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన ఫారెస్ట్ ఆఫీసర్ మురళీధర్ (కిషోర్‌ష్ట్ర గ్రామాన్ని తనికీ చేసి ఇకపై ఎవ్వరూ అడవిలోకి రాకూడదని, అడవికి హాని చేసినట్టుగా తెలిస్తే కఠనంగా శిక్షింపబడతారని హెచ్చిరిస్తాడు. ఇదే క్రమంలో శివకు ఫారెస్ట్ ఆఫీసర్ మురళీధర్ కు మధ్య వైరం మొదలవుతుంది. అది ఆ గ్రామ ఉనికినే ప్రశ్నార్థకంగ మారుస్తుంది. ఈ క్రమంలో శివ తన గ్రామాన్ని, తన ప్రజలను డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్ బారి నుంచి ఎలా రక్షించుకున్నాడు? .. ఈ క్రమంలో అతను ఎదున్కొన్న సవాళ్లేంటీ? అన్నదే కంటారా కథ.
రిషబ్ శెట్టికిది దర్శకుడిగా నాలుగవ సినిమా. రైటర్, హీరో కూడా తనే. పవర్ ఫుల్ స్టోరీని అందించడమే కాకుండా దాన్ని అంతే పవర్ ఫుల్ గా తెరపై ఆవిష్కరించడంతో, హీరోగా తన పాత్రకు న్యాయం చేయడం లోనూ రిషబ్ శెట్టి నూటికి నూరు మార్కులు సాధించాడు. అంతే కాకుండా సినిమాని రిషబ్ తెరకెక్కించిన తీరు, సబ్జెక్ట్ పై అతనికున్న పట్టు అందరిని ఇశ్చర్యానికి గురిచేస్తోంది. సినిమా మేకింగ్ లో కానీ, టేకింగ్ లో కానీ ఏ మాత్రం ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా ఆద్యంతం ఆసక్తికరంగా డ్రామాని నడిపిన తీరు ప్రతీ ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. దక్షిణ కర్ణాటకలో బాగా ప్రాచూర్యం పొందిన బూత్ కోల అనే జానపద అంశాన్ని చక్కగా ఆవిష్కరించిన తీరు బాగుంది. ఈ ఆర్ట్ ఫామే సినిమాకు ప్రధాన బలంగా నిలిచి విజయంలో కిలక పాత్ర పోషించింది.
ఇక శివ పాత్రలో రిషబ్ శెట్టి అద్భుతంగా నటించాడు. తన నటనకు జీతీయ పుకరస్కారం లభించిన ఆశ్చర్యంలేదు. ఆ స్థాయిలో రిషమ్ తనదైన నటనని ప్రదర్శించాడు. ఇక ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కిషోర్ తనదైన స్టైల్లో నటించి మెప్పించాడు. సినిమా కథని మలుపు తిప్పాడు. ఇక లాండ్ లార్డ్ పాత్రలో అచ్యముత్ కుమార్, కమెడియన్ గా ప్రకాష్ తుమినాడ్, హీరోయిన్ గా సస్తమి గౌడ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
అరవింద్ కె. కశ్యప్ ఫొటోగ్రఫీ, బి. అజనీష్ లోక్ నాథ్ సంగీతం, కె.ఎమ్. ప్రకాష్, ప్రతీక్ శెట్టి ఎడిటింగ్, సినిమాని మరో వెలెల్ కు తీసుకెళ్లాయి. హోంబలే ఫిలింస్ మేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటీనటుల నటన, ఎంగేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ నెరేషన్, బి. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ లో కొంత వరకు ట్రిమ్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టరే. కొత్త తరహా సినిమాలని ఇష్టపడే ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకునే సినిమా ఇది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.