Begin typing your search above and press return to search.
మినీ రివ్యూ: 'చుప్'
By: Tupaki Desk | 22 Sep 2022 6:53 AM GMTమినీ రివ్యూ: 'చుప్'
నటీనటులు: సన్నీ డియోల్ - దుల్కర్ సల్మాన్ - శ్రేయా ధన్వంతరి - పూజా భట్
సంగీతం: అమన్ పంత్
నిర్మాతలు: రాకేష్ ఝున్ జున్ వాలా - జయంతిలాల్ గడా - అనిల్ నాయుడు - గౌరీ షిండే
దర్శకుడు: ఆర్. బాల్కీ
'మహానటి' 'కనులు కనులను దోచాయంటే' 'సీతారామం' సినిమాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.. ఇప్పుడు ''చుప్'' అనే హిందీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పా - షమితాబ్ - ప్యాడ్ మాన్ లాంటి విభిన్నమైన చిత్రాలను రూపొందించిన ఆర్. బల్కీ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ తో పాటుగా సన్నీ డియోల్ - శ్రేయ ధన్వంతరి - పూజా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 23న విడుదల కాబోతున్న 'చుప్' సినిమా పబ్లిక్ ఫ్రీ వ్యూ షోలు - ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రదర్శించారు.
కథలోకి వెళ్తే.. 'చుప్' అనేది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ముంబై నగరంలో సినీ క్రిటిక్స్ ను దారుణంగా హత్య చేయబడుతుంటారు. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అరవింద్ మాథుర్ (సన్నీ డియోల్) ను ఈ కేసును దర్యాప్తు చేసే బాధ్యత తీసుకుంటాడు. మరోవైపు ఫ్లోరిస్ట్ డానీ (దుల్కర్ సల్మాన్) మరియు జర్నలిస్ట్ నీలా మీనన్ (శ్రేయ ధన్వంతరి) మధ్య సమాంతరంగా రొమాంటిక్ ట్రాక్ నడుస్తుంది. అయితే చివరికి నగరంలో జరుగుతున్న వరుస హత్యలతో ఈ జంట కనెక్ట్ అవుతుంది. అసలు ఈ హత్యలు చేస్తున్నదెవరు? విమర్శకులనే ఎందుకు టార్గెట్ చేశారు? దీని వెనుక మోటివ్ ఏంటి? అనేది సినిమా కథాంశం.
ఆర్.బాల్కీ ఎప్పుడూ ఆసక్తికరమైన కాన్సెప్ట్స్ తో సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడు సినీ విమర్శకుల వరుస హత్యలు జరగడం అనే పాయింట్ తో మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. సినిమా మొదలైన ఐదు నిమిషాల్లోనే కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు.. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా ఇన్వెస్టిగేషన్ డ్రామాని నడిపించారు. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్ తో విమర్శకులపై సెటైర్స్ వేశారు.
ఇందులో ఫ్లోరిస్ట్ గా మరియు లెజెండరీ నటుడు గురుదత్ అభిమానిగా దుల్కర్ సల్మాన్ కనిపించాడు. దత్ రిఫరెన్స్ లను దర్శకుడు ఉపయోగించిన తీరు చాలా ప్రశంసనీయం. దుల్కర్ అత్యుత్తమ నటన కనబరిచారు. ఇది అతని కెరీర్ లో మరో బెస్ట్ పెరఫార్మన్స్ అని చెప్పాలి. ఇటీవల 'సీతా రామం' సినిమాలో రామ్ గా అలరించిన దుల్కన్.. పూర్తి భిన్నమైన పాత్రలో ఆశ్చర్య పరిచారు.
సన్నీ డియోల్ పోలీస్ ఆఫీసర్ గా మెప్పించాడు. ఆ క్యారెక్టర్ కి సరిగ్గా సరిపోయాడు. తెలుగమ్మాయి శ్రేయా ధన్వంతరి కూడా చక్కని నటన కనబరిచింది. పూజా భట్ అతిధి పాత్రలో కనిపించి మెప్పించింది. సన్నీ డియోల్ మరియు పూజా చాలా ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.
'చుప్' సినిమా సాంకేతికంగా కూడా బాగుంది. అమన్ పంత్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ఇంప్రెసింగ్ గా ఉంది. అలానే గురుదత్ పాటలను ఉపయోగించిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ విభాగాలు కూడా తమ పనిని సమర్ధవంతంగా నిర్వహించారు.
ఓవరాల్ గా ఈ సినిమాలో దుల్కర్ తో పాటుగా మిగిలిన ప్రధాన నటీనటుల పెరఫార్మన్స్ మరియు ఆసక్తికరమైన కథాంశం ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా సీరియల్ కిల్లర్ ఎవరనే దాని గురించి సాగుతుంది. సెకండ్ హాఫ్ లో పోలీసులు అతన్ని ఎలా పట్టుకోగలిగారు అనేది ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా చూపించారు. అయితే చివర్లో సృజనాత్మక స్వేచ్ఛ తీసుకోవడం నిరుత్సాహ పరుస్తుంది. మొత్తం మీద 'చుప్' ప్రేక్షకులను అలరించే ఒక ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.