Begin typing your search above and press return to search.
మినీ రివ్యూ: 'విక్రమార్కుడు'
By: Tupaki Desk | 9 July 2021 3:30 PM GMTనేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కి టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కూడా చేస్తున్నారు. సేతుపతి క్రేజ్ ని క్యాష్ చేసుకోడానికి కొందరు మేకర్స్.. ఆయన నటించిన తమిళ సినిమాలను డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలు అందుబాటులో ఉండటంతో విలక్షణ నటనతో మెప్పించే టాలెంటెడ్ హీరో నటించిన చాలా సినిమాలను ఇప్పటికే తెలుగులో విడుదల చేశారు. ఈ క్రమంలో విజయ్ సేతుపతి నటించిన 'జుంగా' అనే యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ని ''విక్రమార్కుడు'' అనే పేరుతో అనువదించారు. 'ది రియల్ డాన్' అనేది దీనికి ఉపశీర్షిక.
'కాస్మోరా' ఫేమ్ గోకుల్ 'విక్రమార్కుడు' చిత్రానికి దర్శకత్వం వహించారు. 'అఖిల్' బ్యూటీ సాయేషా సైగల్ - 'ప్రేమమ్' ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ ఇందులో హీరోయిన్లుగా నటించారు. సిద్దార్థ సంగీతం సమకూర్చారు. వాయల శ్రీనివాసరావు సమర్పణలో ఆర్.కె.వి.కంబైన్స్ - క్రాంతి కీర్తన పతాకాలపై కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్ - అప్పసాని సాంబశివరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేశారు. తమిళ్ లో సక్సెస్ అయిన ఈ చిత్రాన్ని శుక్రవారం తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ 'ఆహా' లో స్ట్రీమింగ్ కి పెట్టారు. ఈ సినిమాపై పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం!
కథ విషయానికొస్తే.. బస్ కండెక్టర్ గా పని చేసే జుంగా (విజయ్‌సేతుపతి) రోజూ తన బస్సు ఎక్కే ఓ అమ్మాయి (మడోనా సెబాస్టియన్) ని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి కోసం కొందరు ఆకతాయిలతో ఫైట్ చేయడంతో కోపగించుకకున్న తన తల్లి (శరణ్య).. తమ డాన్ ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ చెబుతుంది. తన తాత తండ్రి డాన్ లు అయినప్పటికీ వ్యాపారంలో మోసపోయి థియేటర్ ను కోల్పోయారని జుంగా తెలుసుకుంటాడు. ఈ నేపథ్యంలో ఎలాగైనా తమ థియేటర్ ను తిరిగి సొంతం చేసుకుంటానని.. రియల్ డాన్ అనిపించుకుంటానని తల్లికి మాటిస్తాడు. పిసినారి అయిన జుంగా థియేటర్ కోసం ఏం చేశాడు? చెన్నై టూ ఫారిస్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? డాన్ గా ఎలా మారాడు? యాళిని (సాయేషా సైగల్)తో ఉన్న సంబంధం ఏంటి? అనేది మిగిలిన కథ.
'జుంగా' స్టోరీ వినగానే హీరో కుటుంబాన్ని మోసం చేసి విలన్ ఆస్తి కాజేయడం.. తమ ఆస్తులను తిరిగి దక్కించుకుని విలన్ కు బుద్ధి చెప్పాలని హీరో ప్రతిజ్ఞ పూనడం వంటి కథాంశంతో తెరకెక్కిన అనేక సినిమాలు గుర్తుకు వస్తాయి. మంచి కథలు, పాత్రలు ఎంచుకునే విజయ్ సేతుపతి ఇలాంటి రొటీన్ ఫార్ములాను ఎంచుకోవడమే కాకుండా.. తమిళ్ లో నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగులోకి డబ్ చేసినప్పటికీ ఇందులో తమిళ వాసన ఎక్కువ ఉందని ఆడియన్స్ చెబుతున్నారు. కామెడీ బాగున్నప్పటికి కొన్ని సందర్భాలలో మరీ అతిగా అనిపిస్తుందని అంటున్నారు. తెలుగు డబ్బింగ్ వరకూ పర్వాలేదు కానీ సాంగ్స్ మాత్రం ఒక్కటీ వినసొంపుగా లేదని తేల్చేశారు. 'విక్రమార్కుడు' అనే గంభీరమైన టైటిల్ పెట్టకుండా.. 'జుంగా' పేరుతోనే రిలీజ్ చేస్తే బాగుండేదని అంటున్నారు. అయితే కథ లేనప్పటికీ సినిమా ఆధ్యంతం నవ్వించే ప్రయత్నం చేశారు. విజయ్ సేతుపతి - యోగిబాబు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. హీరోయిన్లు సాయేషా సైగల్ - మడోనా సెబాస్టియన్ తమ పరిధి మేరకు మెప్పించారు. ఓటీటీలో విడుదలైన సినిమా కాబట్టి ఫార్వార్డ్ చేసుకుంటూ 'విక్రమార్కుడు' చిత్రాన్ని ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చని ప్రేక్షకులు తీర్పు ఇచ్చేశారు.