Begin typing your search above and press return to search.

మినీ సంక్రాంతి సమరం.. ఫ్యాన్స్ కు పండగే పండగ

By:  Tupaki Desk   |   22 Dec 2022 6:38 AM GMT
మినీ సంక్రాంతి సమరం.. ఫ్యాన్స్ కు పండగే పండగ
X
మరో మూడు వారాల్లో సంక్రాంతి సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సంక్రాంతికి చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య... బాలకృష్ణ సినిమా వీర సింహారెడ్డి మరియు విజయ్ సినిమా వారసుడు విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఈ మూడు సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఆ సినిమాలు విడుదలకు ముందు క్రిస్మస్‌ కానుకగా ఈ వారం నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఇదో మినీ సంక్రాంతి సమరం అన్నట్లుగా కొనసాగబోతున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. మూడు సినిమాల్లో రెండు డైరెక్ట్‌ సినిమాలు కాగా రెండు తమిళ డబ్బింగ్‌ సినిమాలు.

తెలుగు సినిమాల విషయానికి వస్తే మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన ధమాకా. రెండవది నిఖిల్‌ హీరోగా నటించిన 18 పేజెస్. ఈ రెండు సినిమాలు కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ గా రూపొంది పాజిటివ్‌ బజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాయి. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ధమాకా సినిమా మాస్ ఆడియన్స్‌ తో పాటు ప్రతి ఒక్కరిని అలరించడం ఖాయం అంటూ ధీమాతో ఉన్నారు.

ఇక 18 పేజెస్ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. కార్తికేయ 2 వంటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత నిఖిల్‌ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు తగ్గట్లుగా 18 పేజెస్ సినిమా ఉంటుందని ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు.

ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విశాల్‌ నటించిన లాఠీ సినిమా ను కూడా ఈ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఇప్పటికే విడుదల అయిన లాఠీ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. లాఠీ సినిమాతో విశాల్ టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద మరో విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయంగా పరిస్థితి కనిపిస్తోంది.

లేడీ సూపర్ స్టార్‌ నయనతార నటించిన కనెక్ట్ సినిమా కూడా ఈ క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ ఎత్తున పోటీ ఉన్న ఈ వారంలో ఏ సినిమాది పై చేయి అవుతుంది అనేది చూడాలి. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కనెక్ట్‌ సినిమాను తక్కువ అంచనా వేయలేం. తెలుగు సినిమాలతో సమానంగా లాఠీ సినిమా కూడా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి ఈ నాలుగు సినిమాలు కూడా మినీ సంక్రాంతి సమరం ను తలపిస్తున్నాయి అంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నాలుగు సినిమాలు కూడా మంచి క్రేజ్ దక్కించుకుని పాజిటివ్‌ బజ్ తో విడుదల కాబోతున్నాయి. కనుక ప్రతి ఒక్క సినిమా కూడా మినిమం ఓపెనింగ్స్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఫుల్‌ రన్ లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.