Begin typing your search above and press return to search.
సంక్రాంతికి ముందే మినీ సమరం..మొదలవనుందా??
By: Tupaki Desk | 30 Oct 2022 4:30 AM GMT2023 సంక్రాంతి సమరం రసవత్తరంగా మారబోతోంది. ఈ పోటీలో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ చాలా ఏళ్ల విరామం తరువాత పోటీపడబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాత్లేరు వీరయ్య' సంక్రాంతికి రాబోతోంది. ఇక నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి' వంటి సినిమాలు పోటీకి సై అంటూ రిలీజ్ ని ప్రకటించేశాయి. ఇక ఇదే సమరంలో ప్రభాస్ నటించిన 'ఆది పురుష్' జనవరి 12నే బరిలోకి దిగుతుండగా రెండు తమిళ సినిమాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి.
విజయ్ హీరోగా నటిస్తున్న 'వారీసు' మూవీని 'వారసుడు'గా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీతో పాటు తల అజిత్ హీరోగా నటిస్తున్న 'తునివు' కూడా రాబోతోంది. ఈ ఐదు సినిమాల పోటీతో సంక్రాంతి సమరం రసవత్తరంగా మారబోతోంది. ఇదిలా వుంటే ఈ సమరానికి ముందే మినీ వార్ డిసెంబర్ లో మొదలు కాబోతోందని తెలుస్తోంది. డిసెంబర్ 23న మాస్ మహారాజా రవితేజ నటించిన 'ధమాకా' రాబోతోంది. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ మూవీతో మాసీవ్ హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని రవితేజ గట్టి నమ్మకంతో వున్నాడు.
ఇదే రోజున నిఖిల్ హీరోగా నటించిన '18 పేజెస్' రాబోతోంది. ఇక ఇదే డేట్ ని రణ్ వీర్ సింగ్ కూడా తన 'సర్కస్' సినిమాకు లాక్ చేసుకున్నాడు. రణ్ వీర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందించాడు.
తనకున్న ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకుని రణ్ వీర్ ఈ మూవీతో బాలీవుడ్ కు హిట్ ని అందించడం ఖాయం అని అంటున్నారు. ఇక విజయ్ సేతుపతి తొలిసారి కత్రినా కైఫ్ తో కలిసి నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'మెర్రీ క్రిస్మస్' రిలీజ్ కాబోతోంది.
నేషనల్ అవార్డ్ ని ఆయుష్మాన్ ఖురానాకు అందించిన 'అంధాదూన్' మూవీని రూపొందించిన శ్రీరామ్ రాఘవన్ ఈ మూవీని రూపొందించాడు. థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ మూవీపై కూడా భారీ అంచనాలే వున్నాయి. ఇక సామ్ నటించిన తొలి మైథలాజికల్ మూవీ 'శాకుంతలం'ని కూడా ఇదే సమయంలో రిలీజ్ చేయాలని గుణ శేఖర్ ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఈ మూవీని ఫిబ్రవరిలో రిలీజ్ చేసు అవకాశం కనిపిస్తోందట.
నందినిరెడ్డి 'అన్నీ మంచి శకునములే'ని కూడా దించేయాలనుకుంటున్నారట. కానీ ఇంకా డేట్ ని మాత్రం ఫైనల్ చేయలేదు. ఇక ఈ సినిమాలన్నింటికి ముందే డిసెంబర్ 16న 'అవతార్ 2' రాబోతోంది. దీని సందడి ముందు మన సినిమాలు నివడం కష్టమనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా 'అవతార్ 2' నుంచి రవితేజ 'ధమాకా' వరకు డిసెంబర్ లో మినీ సంక్రాతి సమరం ముందే రాబోతోందని, ఈ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే అంటున్నారు. అయితే ఈ పోటీలో ప్రేక్షకులు 'అవతార్ 2'కే ప్రధాన ప్రాధాన్యతనిస్తే మిగతా సినిమాల పరిస్థితి అంతే సంగతులని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.