Begin typing your search above and press return to search.
#MeeToo అతడితో తక్కువ మాట్లాడలన్న నటి
By: Tupaki Desk | 19 Jan 2023 1:20 PM GMT2018 నుంచి #MeeToo ఉద్యమం ఏదో ఒక రూపంలో ఉనికిని చాటుకుంటూనే ఉంది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఉద్యమం బంపర్ హిట్ అయ్యింది. హాలీవుడ్ బాలీవుడ్ నుంచి కోలీవుడ్ టాలీవుడ్ వరకూ చాలా లైంగిక వేధింపుల ఫర్వాల గురించి చర్చోపచర్చలు సాగాయి. పలువురు దిగ్గజ సెలబ్రిటీలపై పోలీసుల విచారణలు కోర్టుల్లో పోరాటాల కథల గురించి తెలిసినదే.
ఇంతకుముందు గాయని చిన్మయి.. నటి తనూశ్రీ దత్తా .. వరలక్ష్మి శరత్ కుమార్ సహా పలువురు సెలబ్రిటీ భామలు మీటూ వేదికగా పలు ఆరోపణలు చేసారు. సాటి నటులతో తమకు ఎదురైన సన్నివేశాలపై పూస గుచ్చి మరీ చెప్పారు ఈ భామలంతా.
అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా సీనియర్ కథానాయిక మినీషా లాంబా తాజా ఇంటర్వ్యూలో #మీటూ ఉద్యమం గురించి మాట్లాడారు. భారతదేశంలో అలాగే ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఉద్యమం అవసరాన్ని నొక్కి చెప్పిన మినీషా.. నటుడు కం ఫిలింమేకర్ సాజిద్ ఖాన్ పైనా తన అభిప్రాయం తెలిపారు. మీటూ ఉద్యమం సందర్భంగా పలువురు నటీమణులు తమను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు ఆరోపణలు చేయడంతో సాజిద్ ఖాన్ పేరు హెడ్ లైన్స్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరవాత అతడు బిగ్ బాస్ సీజన్ 14లో తొలిసారిగా టెలివిజన్ లో కనిపించాడు. ఈ షోకి తన మిత్రుడు సల్మాన్ ఖాన్ హోస్టింగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవలి ఇంటర్వ్యూలో మినిషాను బిగ్ బాస్ ఇంటి సభ్యుడైన సాజిద్ ఖాన్ గురించి.. మీ టూ ఉద్యమం పర్యవసానం గురించి అడిగారు. వెంటనే మినీషా మాట్లాడుతూ ''మీ టూ ఉద్యమం మహిళల గురించి ప్రాపంచిక ధృక్పథాన్ని మార్చడంలో కీలక అడుగు. ఇది ఒక విప్లవం. ప్రపంచాన్ని మార్చడానికి ఒక విపత్తు అవసరం... అలాంటిదే ఈ విప్లవం. మీరు మాట్లాడుతున్న జీవి (సాజిద్ ఖాన్) గురించి.. ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది'' అని వ్యాఖ్యానించారు.
ఇటీవలే బిగ్ బాస్ 16 నుండి సాజిద్ ఖాన్ స్వచ్ఛందంగా నిష్క్రమించాడు. తన వీడ్కోలు ప్రసంగంలో సాజిద్ చేతులు జోడించి, కన్నీళ్లపర్యంతమైన అతడు ఇలా అన్నాడు. ''జో జో మేరే కిసీ సే భీ ఝగ్దే హో,.. హాత్ జోడ్కే మాఫీ మంగ్తా హు... లేకిన్ ఆప్ లోగో కా బహుత్ సపోర్ట్ రహా (నేను పోరాడిన వారందరికీ క్షమాపణలు చెప్పడానికి చేతులు ముడుచుకున్నాను. కానీ ప్రజలు నాకు చాలా మద్దతు ఇచ్చారు) అని అన్నాడు.
రితీష్ దేశ్ ముఖ్- షెహనాజ్ గిల్- నోరా ఫతేహి- జాన్ అబ్రహం తదితరులు నటిస్తున్న తాజా చిత్రం 100 శాతం చిత్రీకరణ కోసం అతను స్వచ్ఛందంగా బిగ్ బాస్ ఇంటి నుంచి నిష్క్రమించాడు.
ఓ ఇంటర్వ్యూలో మినీషా తన కెరీర్ గురించి కూడా మాట్లాడింది. తాను జర్నలిస్టు కావాలనుకున్నానని ఆ తర్వాత ''అద్భుతమైన అవకాశం రావడంతో అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టాన''ని చెప్పింది. ఆ సమయంలో నాకు అవసరమైన మార్గదర్శకత్వం నాకు లేదు. నేను ప్రతిదీ స్వయంగా చేసాను. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే.. తెలివైనదానినే అనిపిస్తుంది. కచ్చితంగా నేను మళ్ళీ తెరంగేట్రం చేయాల్సి వస్తే నేను కొన్నిటిని భిన్నంగా చేసి ఉండేదానిని''అని తెలిపింది.
మినీషా 2005లో షూజిత్ సిర్కార్ 'యహాన్'తో నటరంగంలో ప్రవేశించింది. ఆ తర్వాత హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్- బచ్నా ఏ హసీనో- కిడ్నాప్ -భేజా ఫ్రై 2- శౌర్య వంటి చిత్రాలలో కనిపించింది. మినిషా రియాలిటీ షో బిగ్ బాస్ 8లో కూడా భాగమైంది. బాలీవుడ్ లో కలర రాకుమారుడు రణబీర్ కపూర్ సరసన బచ్నాయో హసీనో సినిమాలో నటించిన లాంబ నటిగా కెరీర్ ఆరంగేట్రమే ప్రూవ్ చేసుకుంది. మినీషా కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.