Begin typing your search above and press return to search.

మంత్రి రోజా మరోసారి మహేష్ పై అభిమానం ఇలా చాటుకుంది

By:  Tupaki Desk   |   16 Nov 2022 11:16 AM GMT
మంత్రి రోజా మరోసారి మహేష్ పై అభిమానం ఇలా చాటుకుంది
X
సూపర్ స్టార్‌ కృష్ణ పార్ధివదేహానికి ఎంతో మంది సినీ మరియు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ నటి.. మంత్రి రోజా కూడా కృష్ణ ను చివరి చూపు చూసి నివాళులు అర్పించారు. కృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. కృష్ణ గారితో నటించిన గత జ్ఞాపకాలను ఆమె నెమరవేసుకున్నారు.

కృష్ణ పార్ధివ దేహానికి నివాళ్లు అర్పించిన తర్వాత రోజా మీడియా తో మాట్లాడుతూ తన సంతాపం ను తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. కృష్ణ లేరు అనే వార్త ను జీర్ణించుకోలేక పోతున్నాను. ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అయిన ఎన్టీఆర్‌.. ఏయన్నార్‌.. కృష్ణం రాజు.. కృష్ణ గారు చనిపోవడం ఆవేదన కలిగిస్తుందని రోజా అన్నారు.

నాకు చిన్నప్పటి నుండి కూడా కృష్ణ గారు అంటే అమితమైన అభిమానం. హీరోయిన్‌ అయిన తర్వాత ఆయనతో నటించే అవకాశం రావడంతో చాలా సంతోషించాను. షూటింగ్‌ సమయంలో ఆయన్నే చూస్తూ ఉండేదాన్ని. ఒక గొప్ప వ్యక్తితో మంచి మనిషి తో కలిసి నటించే అవకాశం దక్కడం జీవితాంతం కలిగిన అదృష్టంగా భావిస్తాను.

కృష్ణ గారి జీవితం నుండి ప్రతి ఒక్కరు కూడా గొప్ప విషయాలను నేర్చుకోవాలి. సక్సెస్ ను ఎలా అయితే స్వీకరిస్తామో ఫెయిల్యూర్ ను కూడా అలాగే స్వీకరించాలి. ఆయన నుండి ఫెయిల్యూర్స్ ను కూడా పాజిటివ్‌ తో తీసుకోవాలని నేర్చుకోవచ్చు. ఎంత గొప్ప స్థాయికి వెళ్లినా కూడా అందరితో క్లోజ్ గా ఉండాలి.. అందరితో కలిసి ఉండాలని ఆయన నుండి నేర్చుకోవాలి అన్నారు.

నా కెరీర్‌ లో ఇబ్బందులు పడుతున్న సమయంలో.. నేను లో గా ఉన్న సమయంలో కృష్ణ మరియు విజయ నిర్మల గారి యొక్క ప్రోత్సాహం ను ఎప్పటికీ మర్చిపోలేను. కృష్ణ గారితో నటించే అద్భుతమైన అవకాశం దక్కింది. ఇప్పుడు నాకు ఎంతో ఇష్టం అయిన మహేష్ బాబు తో కూడా నటించాలని కోరుకుంటున్నాను.

నేను మళ్లీ నటించడం మొదలు పెడితే మహేష్ బాబుకు అత్త పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను అంటూ రోజా చెప్పుకొచ్చింది. గతంలోనే మహేష్‌ బాబు సినిమా లో నటించాలని ఉంది అంటూ రోజా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కృష్ణ మృతి సందర్భంగా మరోసారి మహేష్ బాబు పై తనకు ఉన్న అభిమానం ను మంత్రి రోజా తన వ్యాఖ్యలతో చెప్పుకొచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.