Begin typing your search above and press return to search.
`క్రిష్` తర్వాత ఇన్నాళ్టికి మరో సూపర్ హీరో పుట్టుకొచ్చాడా?
By: Tupaki Desk | 6 Sep 2021 7:52 AM GMTప్రాంతీయ భాషల్లో సూపర్ హీరో సినిమాలేవీ లేవు. సూపర్ హీరో సినిమా అంటే భారతదేశంలో ఇప్పటివరకూ క్రిష్ ఫ్రాంఛైజీ మాత్రమే. హృతిక్ ని మాత్రమే సూపర్ హీరోగా చూస్తారు. కానీ ఇప్పుడు మలయాళంలో సూపర్ హీరో పుట్టుకు రావడం ఉత్కంఠను పెంచుతోంది. మిన్నల్ మురళి- టోవినో థామస్ నేతృత్వంలోని మలయాళ సూపర్ హీరో సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ప్రపంచంలోని అతి పెద్ద సబ్‌స్క్రిప్షన్ ఆధారిత వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ భారతీయ సూపర్ హీరో మూవీని కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. ఇది నెట్ ఫ్లిక్స్ లో త్వరలోనే రిలీజవుతుందని వెల్లడించారు.
`మిన్నల్ మురళి` అనేది ఈ సినిమా టైటిల్. ఒక సాధారణ వ్యక్తి (థామస్) మెరుపుల తాకిడికి గురై సూపర్ హీరోగా మారతాడు. ఫస్ట్ లుక్ చూడగానే.. ఇది `షాజమ్`ని గుర్తు చేస్తుంది. కానీ భారతీయ వెర్షన్ సూపర్ హీరో అంటూ ప్రచారం సాగుతోంది. మిన్నల్ మురళి లోగో కూడా DC కామిక్స్ సూపర్ హీరోల నుండి ప్రేరణ పొందడం ఆసక్తికరం.
ముడుచుకున్న ధోతి .. ఎర్రని కండువా అతని ముఖాన్ని కవర్ చేస్తూ ఆసక్తిని పెంచింది. బహుశా సూపర్ హీరోని కొంతవరకూ దాచే ప్రయత్నమే ఇది. ఆసక్తికరంగా ఆ ధోతీనే బిగుతుగా ఉండే సూపర్ హీరో కాస్ట్యూమ్ గా రూపాంతరం చెందుతోంది. నీలం - ఎరుపు రంగులతో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఎరుపు ముసుగు చూస్తుంటే.. కోవిడ్ మాస్క్ లాగా అనిపిస్తుంది. మిన్నల్ మురళికి అతీంద్రియ శక్తి ఉంది తప్ప అతడి శక్తులు ఏ స్థాయిలో ఉపయోగిస్తాడు? అన్నదానిపై వివరం లేదు.
నేను మొదటి నుండి మిన్నల్ మురళి పాత్ర కోసం శ్రద్ధ వహించాను అని థామస్ తెలిపారు. నా డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో ప్రతిదీ చర్చించాను. సాధ్యమైనంత ఉత్తమమైన ఫలితాన్ని అందించడానికి ప్రయత్నించాం. మిన్నల్ మురళిని రూపొందించడంలో మేం అపారమైన పని చేసాం. నేను చాలా నేర్చుకున్నాను. ఈ వింత సమయాల్లో నెట్ ఫ్లిక్స్ ద్వారా ప్రజలు తమ ఇండ్ల నుంచే వీక్షించే సౌలభ్యం కలిగినందుకు అందరూ అభినందిస్తున్నందుకు నేను కృతజ్ఞుడను. సినిమా చూసే ప్రతిఒక్కరూ మిన్నల్ మురళిని ఇష్టపడతారని ఆశిస్తున్నాను.. అన్నారు.
థామస్ తో పాటు మిన్నల్ మురళి చిత్రంలో గురు సోమసుందరం (ఆరణ్య కాండం).. హరిశ్రీ అశోకన్ (ఊమపెన్నిను ఉరియాదప్పయ్యన్) .. అజు వర్గీస్ (వెల్లిమూంగ) కూడా నటించారు. జోసెఫ్ (గోధా) అరుణ్ అనిరుధన్ (పాదయోత్తం) - సోఫియా పాల్ నిర్మాతలు.
ప్రజలు భావోద్వేగానికి గురయ్యేంతగా సంబంధం కలిగి ఉండే కనెక్ట్ అయ్యే ఒక సూపర్ హీరోని సృష్టించాలనుకున్నామని జోసెఫ్ సిద్ధం తాజా ప్రకటనలో తెలిపారు. ఒక సూపర్ హీరో సినిమా బలమైన కథనాన్ని కలిగి ఉండటంపై దృష్టి పెట్టాం. నేను విడుదల కోసం ఎదురు చూస్తున్నాను. ఇది మొత్తం టీమ్ కి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది.. అని నిర్మాత అన్నారు.
స్థానిక సూపర్ హీరో: మిన్నల్ మురళి సిరీస్ గా మారేందుకు ఉత్తమ నటులు సాంకేతిక నిపుణుల బృందాన్ని తీసుకువచ్చాము. ఈ సూపర్ హీరో చిత్రం భాషా భేధాన్ని అధిగమిస్తుంది. ప్రధానంగా ఇది భావోద్వేగాలు ఉన్న మనిషి కథ. మిన్నల్ మురళి గురించి గర్వపడుతున్నాను. నెట్ ఫ్లిక్స్ తదుపరి మలయాళ చిత్రానికి చేతులు కలపడానికి మాకు అవకాశం లభించినందుకు సంతోషంగా ఉంది. మిన్నల్ మురళి ప్రారంభం మాత్రమే. మేము ఇప్పుడే ప్రారంభిస్తున్నాము.. అని నిర్మాత పాల్ అన్నారు. క్రిష్ ఫ్రాంఛైజీ తర్వాత సౌత్ సూపర్ హీరో ఎలాంటి ఆదరణ దక్కించుకుంటాడో వేచి చూడాలి.