Begin typing your search above and press return to search.
'మిన్నల్ మురళి' కొత్త ట్రైలర్ రిలీజ్
By: Tupaki Desk | 1 Dec 2021 11:04 AM GMTనెట్ ఫ్లిక్స్ లో విడుదలకు సిద్ధమవుతున్న మలయాళ చిత్రం `మిన్నల్ మురళి` కొత్త ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇంతకుముందు విడుదలైన టీజర్ లు .. ట్రైలర్ లో ట్రేడ్ మార్క్ లైట్నింగ్ కాంతులు.. చూడగానే ఇది సూపర్ హీరో చిత్రం అని అర్థమైంది. అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను పెంచడంలో విఫలమైంది.
కొత్త ట్రైలర్ మిన్నల్ మురళి ని సూపర్ హీరోగా పరిచయం చేసిన విధానం అంతగా రక్తి కట్టించలేదు. చీకటి - అరిష్టం టోన్ ని చూపిస్తూ అగ్నికీలల్లో చిక్కుకున్న గ్రామాన్ని ప్రజలను విధ్వంసం నుండి రక్షించే ప్రయత్నం చేసేవాడిని పరిచయం చేస్తారు. ఇందులో విలన్ పాత్రను రివీల్ చేయలేదు. ట్రైలర్ లో గ్రామం తగలబడడం .. ప్రజల హహాకారాలు .. మరణాలు కనిపిస్తాయి. చివరిగా సూపర్ హీరో ఎంట్రీ ఉంటుంది. అయితే అంతకుమించి ఇందులో ఏ ట్విస్ట్ ని రివీల్ చేయలేదు. మునుముందు ట్రైలర్లలో మిన్నల్ మురళి విలన్ గురించి రివీల్ చేస్తారేమో చూడాలి.

```ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ తో నేను చాలా ఆనందంగా ఉన్నాను. మా అభిమానులు ఊహిస్తూ ఉండేందుకు ఈ బోనస్ ట్రైలర్ ద్వారా తదుపరి స్నీక్ పీక్ ను షేర్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ప్రేక్షకులకు మంచి సినిమా అందించాలని.. సినిమా ద్వారా వారిని అలరించాలని ప్రయత్నిస్తున్నాం. బోనస్ ట్రైలర్ తో ప్రేక్షకులు ఆసక్తిని రేకెత్తిస్తున్నారని .. సినిమాని చూడటానికి మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నామని ఆశిస్తున్నాం`` అని మిన్నల్ మురళి దర్శకుడు బాసిల్ జోసెఫ్ అన్నారు. మిన్నల్ మురళిని చక్కటి చిత్రంగా మరియు అందరికీ నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించడమే మా లక్ష్యం. కథతో పాటు.. నటీనటులు అందరూ అధివాస్తవిక ప్రదర్శనలను అందించారు. వారి ప్రయత్నాల వల్ల ప్రజలు సినిమాను మళ్లీ మళ్లీ చూడాలని కోరుకుంటారని నిర్మాత అన్నారు. మిన్నల్ మురళి చిత్రంలో టోవినో థామస్- గురు సోమసుందరం- హరిశ్రీ- అశోక్- అజు వర్గీస్ తదితరులు నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 24న నెట్ ఫ్లిక్స్ లో ప్రీమియర్ గా ప్రదర్శితం కానుంది.