Begin typing your search above and press return to search.
ప్రభాస్ క్రేజ్ చూశారా?
By: Tupaki Desk | 11 Dec 2015 11:30 AM GMTమన హీరోల సినిమాలు వేరే భాషల్లో విడుదలవడం నామమాత్రమే తప్ప.. పెద్దగా ఎఫెక్ట్ ఉండేది కాదు ఒకప్పుడు. కానీ ఇప్పుడు మన హీరోలకు కూడా పొరుగు బాషల్లో డిమాండ్ బాగానే ఉంటోంది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాత పరిస్థితి చాలా మారింది. ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్ పాపులారిటీ చాలా భాషలకు విస్తరించింది. అతడి పాత సినిమాల్ని ఏరి కోరి పట్టుకెళ్లి మిగతా భాషల్లో విడుదల చేసుకుంటున్నారు అక్కడి నిర్మాతలు.
బాహుబలి చేయడానికి ముందు ప్రభాస్ కెరీర్ లో అతి పెద్ద హిట్టుగా నిలిచిన ‘మిర్చి’ సినిమాను ఒకేసారి రెండు భాషల్లో విడుదలవుతుండటం విశేషం. తమిళంలో ‘వీరబలి’ పేరుతో, మలయాళంలో ‘రెబల్’ పేరుతో ఈ రోజే (శుక్రవారం) విడుదలవుతోంది మిర్చి సినిమా. ఇలా మన హీరో సినిమాను రెండు భాషల్లో అనువాదమై ఒకే రోజు విడుదల కావడం ఇదే తొలిసారి.
సత్యరాజ్ - నదియా - సంపత్ రాజ్ లాంటి తమిళ తారలతో పాటు అక్కడి వాళ్లకు బాగా చేరువైన అనుష్క - రిచా గంగోపాధ్యాయ హీరోయిన్లుగా నటించడంతో తమిళనాట ఈ సినిమాకు మంచి క్రేజే ఉంది. మలయాళంలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలోనే విడుదల చేస్తున్నారు.