Begin typing your search above and press return to search.
బాలయ్యతో మళ్ళీ మళ్లీ... ?
By: Tupaki Desk | 7 Dec 2021 2:30 AM GMTబాలయ్య సెట్స్ మీద ఎలా ఉంటారో బయట జనాలకు పెద్దగా తెలియదు. ఆయనకు కోపం ఎక్కువ అన్నది కూడా ప్రచారంలో ఉంది. అయితే ఆయనతో సినిమాలు తీసిన వారు కానీ డైరెక్షన్ చేసిన వారు కానీ, పక్కన నటించిన వారు కానీ మళ్ళీ మళ్లీ బాలయ్యనే కోరుకుంటారు. ఎందుకంటే బాలయ్యతో వారికి ఉన్న ఎమోషనల్ కనెక్షన్ అలాంటిది మరి. బాలయ్యతో స్వీట్ హార్ట్ అని దగ్గరుండి చూసిన వారు చెబుతారు.
మనసులో ఏమీ దాచుకోకుండా కల్మషం అన్నది లేకుండా ఉండే ఏకైక నటుడు బాలయ్య అని కూడా చాలా మంది చెబుతారు. ఇదిలా ఉంటే బాలయ్యతో అతి పెద్ద సినిమా తీసి రికార్డులు బ్రేక్ చేస్తున్న అఖండ ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి మాటల్లో బాలయ్య గురించి వినాలీ అంటే ఆయన గ్రేట్, లెజెండ్ అనే చెబుతున్నారు.
బాలయ్యతో కోపం అని అంతా అంటారు కానీ ఆయనతో ఒక పది నిముషాలు కనుక కూర్చుకుంటే ఇక లైఫ్ లాంగ్ ఫ్యాన్ అయిపోతాం. అంత మంచి వ్యక్తి ఆయన అంటున్నారు. అఖండ సక్సెస్ మీద తాజాగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అఖండ ఇంత పెద్ద సక్సెస్ కావడానికి ఫ్యాన్స్ తో పాటు యావత్తు తెలుగు వారూ కారణమని అన్నారు.
తాను భారీ సినిమా తీయాలని కల కన్నానని, అది అఖండ మూవీతో తీరిందని చెప్పారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద జయజయ నాయక మూవీని తీసిన రవీందర్ రెడ్డి అఖడ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మంచి హుషార్ గా ఉన్నారు.
ఒక్క మూవీతో అగ్ర నిర్మాతల జాబితాలో చేరిన ఆయన ఇక మీదట వరసబెట్టి సినిమాలు చేస్తానని చెబుతున్నారు. ఇక బాలయ్యతో లేటెస్ట్ హిట్ తరువాత మళ్లీ తీస్తారా అంటే ఎపుడైనా తాను రెడీ అంటున్నారు. ఒకసారి కాదు మళ్లీ మళ్లీ బాలయ్యబాబుతో సినిమాలు చేసేందుకు డబుల్ ఓకే అంటూ నందమూరి ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహం ఇచ్చారు.
ఇక అఖండ మూవీ విషయంలో రాజీ లేని విధంగా ఖర్చు చేసి టెక్నికల్ గా మూవీని వేరే లెవెల్ కి తీసుకెళ్ళడంతో రవీందర్ రెడ్డి పాత్ర ఎంతో ఉంది. అగ్ర నిర్మాతలు సైతం ఈ రోజుల్లో ఖర్చుకు వెనకాడుతున్న నేపధ్యంలో బాలయ్య బోయపాటి కాంబో మీద పందెం కాసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఆయన. ఇక హ్యాట్రిక్ మూవీని తన ఖాతాలో వేసుకుని టాలీవుడ్ కి మోస్ట్ వాంటెండ్ ప్రొడ్యూసర్ గా మారిపోయారు. మొత్తానికి బాలయ్యతో మళ్ళీ ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద సినిమాను ఫ్యాన్స్ చూసే చాన్స్ ఉంది మరి.