Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : మత్తెక్కించే చూపులకు ఎలాంటివాడైనా పడిపోవాల్సిందే..!

By:  Tupaki Desk   |   1 May 2023 6:00 AM GMT
ఫోటో స్టోరీ : మత్తెక్కించే చూపులకు ఎలాంటివాడైనా పడిపోవాల్సిందే..!
X
టిక్ టాక్ డబ్ స్మాష్ వీడియోస్ తో పాపులర్ అయ్యి ఆ క్రేజ్ తో సినిమా ఛాన్స్ అందుకుంది చెన్నై చిన్నది మృణాళిని రవి. సూపర్ డీలక్స్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్ అయినా అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. బిగ్ బాస్ ఫేం సోహెల్ హీరోగా నటించిన ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమాలో హీరోయిన్ గా నటించింది మృణాళిని రవి. మరోపక్క సుధీర్ బాబు మామ మశ్చీంద్ర సినిమాలో కూడా ఛాన్స్ అందుకుంది.

సుధీర్ బాబు సినిమాతో అయినా అమ్మడికి లక్ కలిసి వస్తుందేమో చూడాలి. సినిమా అవకాశాలు ఎలా ఉన్నా అమ్మడు ఫోటో షూట్స్ తో ఆడియన్స్ ని మెప్పిస్తుంది. లేటెస్ట్ గా వైట్ కలర్ షర్ట్ బ్లాక్ మిడ్డీతో అమ్మడు అదరగొట్టేసింది. తన ఓర కళ్ళతో మత్తెక్కించే చూపులకు ఎలాంటివాడైనా సరే పడిపోవాల్సిందే. అమ్మడి ఈ ఫోటో షూట్ చూసి చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అని కామెంట్స్ పెడుతున్నారు.

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను కావాలని కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న మృణాళిని రవి మరీ వేగం తగ్గితే అమ్మడిని మర్చిపోయే పరిస్థితి వస్తుందని గుర్తుంచుకోవాలి. సినిమాలు చేసినా చేయకపోయినా ఫోటో షూట్స్ తో మాత్రం తమ ఫ్యాన్స్ ని అలరిస్తుంటారు హీరోయిన్లు. వారి దారిలోనే మృణాళిని కూడా ఫోటో షూట్స్ తో కవ్విస్తుంది. టాలీవుడ్ లో వరుస సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్న అమ్మడికి సరైన ఛాన్స్ లు రావట్లేదని చెప్పొచ్చు.

హరీష్ శంకర్ లాంటి డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసినా మృణాళిని రవికి మంచి ఛాన్స్ లు రావట్లేదు. మరి రాబోతున్న సుధీర్ సినిమా అయినా వర్క్ అవుట్ అవుతుందా అమ్మడి కెరీర్ లో జోష్ నింపుతుందా లేదా అన్నది చూడాలి.